he
-
'హి' చిత్రం విజయం సాధించాలి: మంత్రి హరీశ్ రావు
బిగ్‌బాస్ ఫేమ్ సంజన అన్నే ప్రధాన పాత్రలో నటించిన నటించిన తాజా చిత్రం ‘ హి (హంట్స్ ఎవ్రివన్)’. అర్జున్ ఆర్య, రాగినమ్మ, శివ, రసూల్, సంజయ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. శ్రీనివాస్ ఎం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డబ్ల్యూఎంబి పిక్చర్స్ బ్యానర్ పై సుస్మ సుందర్ నిర్మించారు.తాజాగా ఈ మూవీ టైటిల్ పోస్టర్ని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు విడుదల చేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'హి' చిత్రం అందరికి నచ్చాలని, ఈ సినిమాతో చిత్రంలో పనిచేసిన నటీనటులకు సాంకేతిక నిపుణులకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ‘‘హి’లో హారర్ తో పాటు థ్రిల్లింగ్ ఎలెమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి, అలాగే ఆడియన్స్ సస్పెన్స్ అయ్యే ఎపిసోడ్స్ ఈ మూవీలో ప్రేత్యేకం’అని చిత్రబృందం పేర్కొంది. -
స్క్రీన్ టెస్ట్
♦ త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ చెబుతుంటే పవన్‌కల్యాణ్ నిద్రపోయారట! పవన్ నిద్రలేచే వరకూ వెయిట్ చేసిన త్రివిక్రమ్ ఆయనకు టాటా చెప్పి వచ్చేశారు. అదే కథతో మరో హీరోతో త్రివిక్రమ్ తీసిన సినిమా ఏది? ఎ) అతడు బి) సన్నాఫ్ సత్యమూర్తి సి) ఆఆ డి) నువ్వే నువ్వే ♦ మాస్లో మాంచి ఫాలోయింగ్ ఉన్న ఈయన హీరో కాకముందు ఎనిమిదేళ్ల పాటు క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నారు. ఆయనెవరో చెప్పుకోండి! ఎ) నాగచైతన్య బి) ప్రభాస్ సి) రామ్ చరణ్ డి) రామ్ ♦ ఏ సినిమాలోని ఫైట్స్ కోసం వరుణ్‌తేజ్ కర్రసాములో స్పెషల్ ట్రయినింగ్ తీసుకున్నారు? ఎ) ముకుంద బి) కంచె సి) లోఫర్ డి) మిస్టర్ ♦ ‘అరుంధతి’ అంటే అనుష్కే. ఆమెను తప్ప ఆ పాత్రలో మరొకర్ని ఊహించుకోవడం కష్టం. కానీ, దర్శక, నిర్మాతల ఫస్ట్ ఛాయిస్ అనుష్క కాదు. ‘అరుంధతి’గా ముందు ఎవర్ని అనుకున్నారో తెలుసా? ఎ) నయనతార బి) శ్రియ సి) త్రిష డి) మమతా మోహన్‌దాస్ ♦ ‘దువ్వాడ జగన్నాథమ్’లోని ‘అస్మైక యోగ తస్మైక భోగ..’ పాటలోని తొలి చరణం ఏ వాక్యంతో మొదలవుతుంది? ఎ) అంగాంగ తేజ శృంగారభావ సుకుమార సుందరం... బి) మడిలో వడిలో బడిలో గుడిలో... సి) ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది... డి) నవ లలన నీ వలన కలిగే ఎంతో వింత చలి నాలోన... ♦ ‘సైజ్ జీరో’ సినిమా కోసం అనుష్క ఎన్ని కిలోలు బరువు పెరిగారో తెలుసా? ఎ) 10 కిలోలు బి) 15 కిలోలు సి) 20 కిలోలు డి) 25 కిలోలు ♦ ‘కమీషనర్ కూతుళ్లకు మొగుళ్లు రారా..’ – రవితేజ చెప్పిన ఈ డైలాగ్ ఏ సిన్మాలోనిది? ఎ) ఇడియట్ బి) సారొచ్చారు సి) మిరపకాయ్ డి) విక్రమార్కుడు ♦ హీరో వరుణ్ సందేశ్ తాతయ్య 28 ఏళ్లపాటు ఆలిండియా రేడియాలో వర్క్ చేశారు. ఆయనెవరో తెలుసా? ఎ) ప్రయాగ రామకృష్ణ బి) జీడిగుంట రామచంద్రమూర్తి సి) దుగ్గిరాల పూర్ణయ్య డి) కందుకూరి సూర్యనారాయణ ♦ ఓ మలయాళ సినిమాను తెలుగులో వెంకటేశ్, హిందీలో సల్మాన్‌ఖాన్ సేమ్ టైటిల్‌తో రీమేక్ చేశారు. ఆ సినిమా పేరేంటి? ఎ) దృశ్యం బి) బాడీగార్డ్ సి) గురు డి) గోపాల గోపాల ♦ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ అంటే ఏంటి? ఎ) కదిలే బొమ్మలను యానిమేషన్ ద్వారా క్రియేట్ చేయడం...బి) యాక్టర్స్ శరీర కదలికలను క్యాప్చర్ చేసి, ఆ మోషన్‌ను యానిమేటెడ్ క్యారెక్టర్‌కు సెట్ చేయడం సి) స్లో మోషన్లో పిక్చర్‌ని క్యాప్చర్ చేసి, స్పీడుగా ప్రొజెక్ట్ చేయడం... డి) నటీనటులు రన్నింగ్ చేసే సీన్స్‌ను క్యాప్చర్ చేయడం ♦ తెలుగు జాతి మనది... నిండుగా వెలుగుజాతి మనది’– ఈ పాటలో సినారె సాహిత్యం, ఘంటసాల గాత్రం అద్భుతం! అయితే... ఘంటసాలతో పాటు పాటలో కొన్ని లైన్స్ పాడిన హీరో ఎవరో తెలుసా? ఎ) ఏయన్నార్ బి) ఎన్టీఆర్ సి) శోభన్‌బాబు డి) కృష్ణ ♦ భూస్వామ్యు వ్యవస్థ, రజాకార్లకు వ్యతిరేకంగా దర్శకుడు బి. నర్సింగ్‌రావు తీసిన ‘మా భూమి’లో హీరో ఎవరు? ఎ) సాయిచంద్ బి) కృష్ణ సి) సుమన్ డి) కృష్ణంరాజు ♦ బాలచందర్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన సినిమా ఏది? అందులో జయప్రద హీరోయిన్! ఎ) ఆడవాళ్లూ మీకు జోహార్లు బి) అంతులేని కథ సి) 47 రోజులు డి) ఇదికథ కాదు ♦ అక్కినేని నాగార్జున బాలనటుడిగా చేసిన ఏయన్నార్ సినిమా? చిన్న హింట్: ఆ సినిమాకు అదుర్తి సుబ్బారావు దర్శకుడు! ఎ) డాక్టర్ చక్రవర్తి బి) వెలుగు నీడలు సి) మూగమనసులు డి) సుడిగుండాలు ♦ యాక్షన్ కింగ్ అర్జున్ శరీరానికి ‘ఒకే ఒక్కడు’లోని ఫైట్ సీన్లో నిప్పు అంటుకుంటుంది? ఫైట్ చేస్తూ అర్జున్ బురదలోకి దూకుతారు. ఆ యాక్షన్ సీక్వెన్స్‌కి ఫైట్ మాస్టర్ ఎవరో తెలుసా? ఎ) పీటర్ హెయిన్స్ బి) రామ్–లక్ష్మణ్ సి) విజయన్ డి) కణల్ కన్నన్ ♦ అందాల రాక్షసి’ ఫేమ్, హీరో రాహుల్ రవీంద్రన్ భార్య ఫేమస్ సింగర్. డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. ఆమె ఎవరో తెలుసా? ఎ) చిన్మయి బి) సునీత సి) గీతా మాధురి డి) ప్రణవి ♦ ‘ఖడ్గం’లో సోనాలి బింద్రేకు డబ్బింగ్ చెప్పిన ఒకప్పటి హీరోయిన్, ఇప్పటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరు? ఎ) రాశీ బి) సరిత సి) రేవతి డి) రమ్యకృష్ణ ♦ నాగార్జున ‘నేనున్నాను’ సినిమాకు ఎం.ఎం. కీరవాణి స్వరకర్త. కానీ, ఆయనకంటే ముందు మరో సంగీత దర్శకుణ్ణి తీసుకున్నారు. రెండు పాటల రికార్డింగ్ కూడా పూర్తయిన తర్వాత చిత్రబృందంతో మనస్పర్థల కారణంగా పక్కకు తప్పుకున్న ఆ సంగీత దర్శకుడు ఎవరు? ఎ) చక్రి బి) ఆర్పీ పట్నాయక్ సి) మణిశర్మ డి) దేవిశ్రీ ప్రసాద్ ♦ సూపర్‌స్టార్ కృష్ణ ఏసుక్రీస్తుగా నటించిన ఈ స్టిల్ ఏ సిన్మాలోనిది? ఎ) శాంతి సందేశం బి) కరుణామయుడు సి) తొలి కిరణం డి) ఏసు మహిమలు ♦ ఈ ఫొటోలోని చిన్నారి ఓ హీరో కూతురు. ఆమె నటి కూడా! ఎవరో చెప్పుకోండి? ఎ) డి. సుప్రియ బి) మంజుల సి) నీహారిక డి) మంచి లక్ష్మి మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు: 1) ఎ 2) సి 3) ఎ 4) డి 5) సి 6) సి 7) ఎ 8) బి 9) బి 10) బి 11) బి 12) ఎ 13) సి 14) డి 15) ఎ 16) ఎ 17) డి 18) బి 19) ఎ 20) డి -
ఆ అర్హత ‘ఆళ్ళ’కు లేదు
-
నయీం 'ఆత్మ' ఎలా ఉంటాడో తెలుసా?
-
ఆమే.. అతడైయాడు !
-
ఘర్షణెందుకురా మగడా అంటే...?
ఉత్త(మ)పురుష మావారికి నాతో గిల్లికజ్జాలు పెట్టుకోవడం అంటే చాలా సరదా. నాకేమో ఇంట్లో ప్రశాంతత ఇష్టం. ఏ చిన్న సంఘటన జరిగినా చాలు... దాంట్లోంచి ఏదో ఒక పాయింట్‌ను పట్టుకుని అదేపనిగా వాదిస్తుంటారాయన. ఆయన వాదనలెలా ఉంటాయంటే... నేనోరోజు పప్పు వండుతాను. ఆరోజు చికెన్ ఎందుకు చేయలేదని గొడవ. ఇవ్వాళ్ల శనివారం కదా అందుకే వండలేదంటాను నేను. అప్పుడు స్పీచ్ మొదలు... ‘‘నువ్వసలు జీవహింసే చేయదలచుకోలేదనుకో. ఇక చికెన్ తినడం పూర్తిగా మానెయ్. అంతేగానీ... శనివారం ఒక్కరోజు తినకుండా ఉండి, ఆ తర్వాతి రోజుల్లో తింటూ ఉంటే ఏం లాభం? పైగా నువ్వు ఆ ఒక్క రోజూ వండనంత మాత్రాన నిన్ను కోడిజనబాంధవురాలని ఎవరూ అనరు. అంతరించిపోతున్న కోడి జాతికి నువ్వు చేసిన సేవలకు నీకెవరూ పక్షివిభూషణ, పక్షిభూషణ, పక్షిరత్న లాంటి బిరుదేమీ ఇవ్వరు. కాబట్టి ఇలాంటివేవీ పెట్టుకోకు. ఇకనుంచి శనివారమైనా కోడి వండాల్సిందే’’ అంటూ లెక్చర్ ఇస్తారు. అసలు ఆయనకు ఇదేం బుద్ధో నాకు అర్థం కాదు. ఆయనకు తినాలని ఉంటే శనివారం మాత్రం నేను వండకుండా ఉంటానా? ‘‘ఇవ్వాళ్ల ఏం తింటారు మహానుభావా’’... అని నేను అడుగుతూనే ఉంటాను. ఓ పట్టాన జవాబివ్వరు. ఇక వంటకు ఆలస్యం అయిపోతోందంటూ హడావుడిగా ఏదో చేసేస్తాను. ఒకవేళ ఆయనకు నిజంగానే కోడి తినాలని ఉందే అనుకుందాం. మార్కెట్‌కు వెళ్లి చికెన్ తెచ్చి ఇవ్వవచ్చు కదా. అదేం చేయరు. కానీ... భోజనం తయారు అని నేననగానే ఆయనా తయారు... మళ్లీ గొడవకూ, ఘర్షణకు. ఆయన పెట్టే ఈ ఆరళ్లూ... ఈ అల్లర్లూ తట్టుకోలేక ఒక రోజున గట్టిగానే నిలదీశా. అలాంటి రియాక్షన్ నా నుంచి ఎదురు చూళ్లేదాయన. అందుకే కాస్త దెబ్బతిన్నట్టు చూశారు. కాస్త దార్లోకి వస్తూ వస్తూనే మళ్లీ ఎంత చెడ్డా ఆ పురుషాహంకారం కాస్త గాడి తప్పిస్తుంటుంది. ఆ పురుషాధిక్య బుద్ధి ఎక్కడికి పోతుందీ? అందుకే దిగి వస్తూ కూడా తన మాటల్లో కాస్త సైన్సూ, రొమాన్సూ కలగలిపి చెప్పారు. ‘‘ఏవోయ్... తరచు ఏదో ఒక విషయంపై గొడవ పడుతూ, నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరెందుకూ, ఎప్పుడూ ఏదో ఘర్షణ లేకపోతే మీకు తోచదా?... గొడవ లేకుండా సంసార పడవ నడవదా అంటుంటావ్ కదా. ఎడ్డెమంటే తెడ్డెమంటూ అడ్డు వేస్తున్నామనుకో. అంటే ఏమిటన్నమాట? మన మధ్య ఘర్షణ ఉంటుందన్న మాట. ఘర్షణ అంటే మరేమిటో కాదు... ఫ్రిక్షన్. ఈ ఫ్రిక్షన్ వల్లనే గచ్చు మీద నడుస్తున్నా అడుగు కుదురుగా పడుతుంది. నడక చెదరకుండా సాగుతుంది. ఆ ఫ్రిక్షనే లేదనుకో. ఆ నడక గచ్చు మీద కాకుండా, రొచ్చులోన నడచినట్టయి, జర్రుమంటూ జారిపడతాం. కాబట్టి సంసారంలో నిత్యం కావాల్సిందే ‘ఘర్షణ’. అందుకే నిత్యం నీతో నా సంఘర్షణ’’ అంటూ ముగించారాయన. ఈ పురుషపుంగవులున్నారే! రొచ్చుమీద ఫ్రిక్షన్ తగ్గి కిందపడ్డా... తమ కాలుపైనే, పైపైనే అంటారు. ఏం మగాళ్లో ఏమో?! - వై! -
దేవుడిని నవ్వించేవాళ్లు!
దైవికం మతాలకు వేర్వేరు దేవుళ్లు కానీ, మానవాళికి ఒక్కడే కదా దేవుడు. పేర్లు, రూపాలు వేరైనంత మాత్రాన ఒకరిని తలచుకుంటే ఇంకొకరికి కోపం వస్తుందా! ఒకరిని ప్రార్థిస్తుంటే ఇంకొకరు చెవులు మూసుకుంటారా? ఇఫ్ యు వాంట్ మేక్ గాడ్ లాఫ్, టెల్ హిమ్ అబౌట్ యువర్ ప్లాన్స్ - అంటాడు ఊడీ ఆలెన్. దేవుణ్ణి నవ్వించాలనుకుంటే, మన భవిష్యత్ ప్రణాళికల గురించి ఆయనకు చెబితే సరిపోతుందట. ఊడీ అమెరికన్ దర్శకుడు. నాలుగు ఆస్కార్ల విజేత. ఇదొక్కటే ఊడీ ప్రతిభ కాదు. మంచి రచయిత, న టుడు, జాస్ సంగీతకారుడు, కమెడియన్, నాటక కర్త, గొప్ప సెటైరిస్టు. మనిషికి 78 ఏళ్లు. ఆరోగ్యంగా ఉన్నారు. నవ్వుతూ, నవ్విస్తూ ఉన్నారు. ఇంతా చేసి ఆయన అఫీయిస్ట్ (నాస్తికుడు). దేవుడి మీద కూడా సెటైర్లు వేస్తుంటాడు. కానీ అవి దేవుడికి కోపం తెప్పించేవి కాదు. దేవుణ్ని, మనిషినీ ఇద్దర్నీ నవ్వించేవి. మన దగ్గర కూడా కొందరు అప్పుడప్పుడు తమకు తెలియకుండానే దేవుణ్ణి నవ్విస్తుంటారు... ‘మా దేవుడు గ్రేట్’ అంటే, ‘మా దేవుడు గ్రేట్’ అని. ఈ మధ్య అలా దేవుణ్ణి నవ్వించిన పెద్ద మనిషి ద్వారకపీఠం శంకరాచార్యులు స్వామీ స్వరూపానంద. షిర్డీ సాయిబాబా ముస్లిం అని, ఆయన్ని హిందువులు ఆరాధించకూడదని; బాబా ఏనాడూ పవిత్ర గంగా నదిలో స్నానమాచరించలేదు కనుక ఆయన్ని ఆరాధించేవారికి గంగలో మునిగే యోగ్యత ఉండదని ఇటీవలి ప్రసంగంలో స్వరూపానంద సెలవిచ్చారు. ఈ మాటలన్నీ ఆయన కేంద్ర మంత్రి ఉమాభారతిని ఉద్దేశించి అన్నవి. ‘సాధ్వి’ ఉమాభారతి కూడా సాయిబాబాను ఆరాధించడమేమిటన్నది ఆయన ప్రశ్న. లేదా ప్రశ్నార్థకంతో కూడిన ఆశ్చర్యం. ఇదే మాటను ఆయన గతంలో ఉమాభారతిని దృష్టిలో పెట్టుకుని అన్నప్పుడు ‘‘ఆరాధన అన్నది వ్యక్తిగత విశ్వాసాలకు సంబంధించినది’’ అని ఒక్క మాటతో ఆమె సరిపుచ్చారు. ఇప్పుడు కూడా స్వరూపానంద వ్యాఖ్యలపై ఆమె ఏమీ మాట్లాడలేదు. అలా మాట్లాడక పోవడం కూడా ఆయనకు కోపం తెప్పించినట్లుంది. ‘‘ఉమాభారతి రంగులు మార్చి సాయిబాబాను కొలుస్తున్నారు. బాబా ముస్లిం. ఆ సంగతి తెలిసీ ఆయన్ని కొలుస్తున్నారంటే, ఇక ఆమెపై ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు ఎలా కురుస్తాయి’’ అని అన్నారు. ఈ మాటలు ఆ భగవానుడికి నవ్వు తెప్పించకుండా ఎలా ఉంటాయి?! మతాలకు వేర్వేరు దేవుళ్లు కానీ, మానవాళికి ఒక్కడే కదా దేవుడు. పేర్లు, రూపాలు వేరైనంత మాత్రాన ఒకరిని తలచుకుంటే ఇంకొకరికి కోపం వస్తుందా! ఒకరిని ప్రార్థిస్తుంటే ఇంకొకరు చెవులు మూసుకుంటారా? ఒకరిని వరం కోరుకుంటే, మనకెందుకులే అని ఇంకొకరు పట్టనట్లు ఉండిపోతారా? బాబా అంటే శ్రీరామచంద్రుడు పలక్కండా పోతాడా? రామా అంటే జీసెస్ రాకుండా ఉంటాడా? అల్లా అంటే ఆ పరమాత్ముడికి వినిపించకుండా ఉంటుందా?! మనుషుల్లోనే దేవుడు ఉంటాడంటారు కదా రమణ మహర్షి, అలాంటప్పుడు సృష్టికర్త ఎక్కడ ఉంటేనేం? ఏ పేరుతో ఉంటేనేం? ఏ రూపంలో ఉంటేనేం? అసలు ఏ రూపంలోనూ లేకపోతేనేం? దేవుడి గురించి పొసెసివ్‌గా (‘అమ్మా...నా దేవుడు’ అన్నట్లు) గొడవ పడడం అన్నది ‘మా ఇంట్లో దేవుడి పటానికి నువ్వెందుకు దండం పెడుతున్నావ్?’ అని అడగడం లాంటిది. లేదా ‘మా వీధిలో గుడికి నువ్వెందుకొచ్చావ్’ అని తగాదా పడడం లాంటిది. స్వామీ స్వరూపానందకు ఇవన్నీ తెలీదనుకోవాలా? లేక సచిన్‌ని దేవుడిలా భావించే ఒక సాధారణ ఆత్మ ఆయనలో ప్రవేశించి ఆయన చేత ఈ మాటలన్నీ అనిపించిందా? రష్యన్ టెన్నిస్ స్టార్ మారియా షరపోవా ‘సచిన్ ఎవరో నాకు తెలీదు’ అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అన్నప్పుడు సచిన్ అభిమానులు తీవ్రంగా కలత చెందారు! ‘గాడ్ ఆఫ్ క్రికెట్’ గురించి తెలీదా అని విస్తుపోయారు. కొందరైతే ‘‘పోనీయండి పాపం, దేవుడి గురించి తెలీదంటే ఆమె నాస్తికురాలు అయ్యుండాలి’’ అని పెద్దమనసు చేసుకున్నారు. కనీసం అలాగైనా పెద్దమనసు చేసుకోలేకపోయారా స్వరూపానంద!! - మాధవ్ శింగరాజు -
సైకిల్‌పై సఫారీల మధ్య సవారీ...!
అమ్మ, నాన్న, అతడు... అదే అతడికి ప్రపంచం. ఆ ప్రపంచంలో అతడు ఉన్నట్టుండి ఒంటరి అయ్యాడు. అమ్మ, నాన్న ఇద్దరూ క్యాన్సర్‌తో మరణించారు. చాలాకాలంపాటు వారి జ్ఞాపకాలు అతడిని చుట్టుముట్టేవి. దాంతో వాళ్ల జ్ఞాపకాల నుంచి బయటపడాలని అనుకొన్నాడు. సుదూర ప్రయాణానికి సిద్ధం అయ్యాడు. అది కూడా సైకిల్ మీద. తను నివసించే దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ నుంచి మొదలుపెట్టి దాదాపు ఎనిమిదినెలలుగా ఒక్కోదేశమూ దాటుతున్నాడు. సఫారీల మధ్య సైకిల్ పై సంచరిస్తూ ఉన్నాడు. మొత్తం ఆఫ్రికాను చుట్టేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నాడు. అతడి పేరు డెరెక్ క్యూలిన్. జీవితం చాలా చిన్నది, దాన్ని భయాలతోనూ చింతలతోనూ గడిపేయడం అనవసరం అని భావించే మనుషుల్లో క్యూలిన్ కూడా ఒకరు. గత ఏడాది నవంబర్ నుంచి బోత్స్వానా, టాంజానియాలను దాటి కెన్యా వరకూ చేరుకొన్నాడు. తన యాత్ర ద్వారా క్యాన్సర్ బాధిత చిన్నారుల కోసం విరాళాల సేకరణ ప్రయత్నమూ చేస్తున్నాడు క్యూలిన్. ఈ ప్రయాణానికి పూనుకోకపోతే జీవితంలో తాను ఎంతో కోల్పోయేవాడినని, ఇది అపూర్వమైన అనుభవమని క్యూలిన్ అంటాడు.