స్క్రీన్ టెస్ట్
♦ త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ చెబుతుంటే పవన్‌కల్యాణ్ నిద్రపోయారట! పవన్ నిద్రలేచే వరకూ వెయిట్ చేసిన త్రివిక్రమ్ ఆయనకు టాటా చెప్పి వచ్చేశారు. అదే కథతో మరో హీరోతో త్రివిక్రమ్ తీసిన సినిమా ఏది?
ఎ) అతడు బి) సన్నాఫ్ సత్యమూర్తి సి) ఆఆ డి) నువ్వే నువ్వే
♦ మాస్‌లో మాంచి ఫాలోయింగ్ ఉన్న ఈయన హీరో కాకముందు ఎనిమిదేళ్ల పాటు క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నారు. ఆయనెవరో చెప్పుకోండి!
ఎ) నాగచైతన్య బి) ప్రభాస్ సి) రామ్ చరణ్ డి) రామ్
♦ ఏ సినిమాలోని ఫైట్స్ కోసం వరుణ్‌తేజ్ కర్రసాములో స్పెషల్ ట్రయినింగ్ తీసుకున్నారు?
ఎ) ముకుంద బి) కంచె సి) లోఫర్ డి) మిస్టర్
♦ ‘అరుంధతి’ అంటే అనుష్కే. ఆమెను తప్ప ఆ పాత్రలో మరొకర్ని ఊహించుకోవడం కష్టం. కానీ, దర్శక, నిర్మాతల ఫస్ట్ ఛాయిస్ అనుష్క కాదు. ‘అరుంధతి’గా ముందు ఎవర్ని అనుకున్నారో తెలుసా?
ఎ) నయనతార బి) శ్రియ సి) త్రిష డి) మమతా మోహన్‌దాస్
♦ ‘దువ్వాడ జగన్నాథమ్’లోని ‘అస్మైక యోగ తస్మైక భోగ..’ పాటలోని తొలి చరణం ఏ వాక్యంతో మొదలవుతుంది?
ఎ) అంగాంగ తేజ శృంగారభావ సుకుమార సుందరం... బి) మడిలో వడిలో బడిలో గుడిలో...
సి) ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది... డి) నవ లలన నీ వలన కలిగే ఎంతో వింత చలి నాలోన...
♦ ‘సైజ్ జీరో’ సినిమా కోసం అనుష్క ఎన్ని కిలోలు బరువు పెరిగారో తెలుసా?
ఎ) 10 కిలోలు బి) 15 కిలోలు సి) 20 కిలోలు డి) 25 కిలోలు
♦ ‘కమీషనర్ కూతుళ్లకు మొగుళ్లు రారా..’ – రవితేజ చెప్పిన ఈ డైలాగ్ ఏ సిన్మాలోనిది?
ఎ) ఇడియట్ బి) సారొచ్చారు సి) మిరపకాయ్ డి) విక్రమార్కుడు
♦ హీరో వరుణ్ సందేశ్ తాతయ్య 28 ఏళ్లపాటు ఆలిండియా రేడియాలో వర్క్ చేశారు. ఆయనెవరో తెలుసా?
ఎ) ప్రయాగ రామకృష్ణ బి) జీడిగుంట రామచంద్రమూర్తి
సి) దుగ్గిరాల పూర్ణయ్య డి) కందుకూరి సూర్యనారాయణ
♦ ఓ మలయాళ సినిమాను తెలుగులో వెంకటేశ్, హిందీలో సల్మాన్‌ఖాన్ సేమ్ టైటిల్‌తో రీమేక్ చేశారు. ఆ సినిమా పేరేంటి?
ఎ) దృశ్యం బి) బాడీగార్డ్ సి) గురు డి) గోపాల గోపాల
♦ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ అంటే ఏంటి?
ఎ) కదిలే బొమ్మలను యానిమేషన్ ద్వారా క్రియేట్ చేయడం...బి) యాక్టర్స్ శరీర కదలికలను క్యాప్చర్ చేసి,
ఆ మోషన్‌ను యానిమేటెడ్ క్యారెక్టర్‌కు సెట్ చేయడం
సి) స్లో మోషన్‌లో పిక్చర్‌ని క్యాప్చర్ చేసి, స్పీడుగా ప్రొజెక్ట్ చేయడం... డి) నటీనటులు రన్నింగ్ చేసే సీన్స్‌ను క్యాప్చర్ చేయడం
♦ తెలుగు జాతి మనది... నిండుగా వెలుగుజాతి మనది’– ఈ పాటలో సినారె సాహిత్యం, ఘంటసాల గాత్రం అద్భుతం! అయితే... ఘంటసాలతో పాటు పాటలో కొన్ని లైన్స్ పాడిన హీరో ఎవరో తెలుసా?
ఎ) ఏయన్నార్ బి) ఎన్టీఆర్ సి) శోభన్‌బాబు డి) కృష్ణ
♦ భూస్వామ్యు వ్యవస్థ, రజాకార్లకు వ్యతిరేకంగా దర్శకుడు బి. నర్సింగ్‌రావు తీసిన ‘మా భూమి’లో హీరో ఎవరు?
ఎ) సాయిచంద్ బి) కృష్ణ సి) సుమన్ డి) కృష్ణంరాజు
♦ బాలచందర్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన సినిమా ఏది? అందులో జయప్రద హీరోయిన్!
ఎ) ఆడవాళ్లూ మీకు జోహార్లు బి) అంతులేని కథ సి) 47 రోజులు డి) ఇదికథ కాదు
♦ అక్కినేని నాగార్జున బాలనటుడిగా చేసిన ఏయన్నార్ సినిమా? చిన్న హింట్: ఆ సినిమాకు అదుర్తి సుబ్బారావు దర్శకుడు!
ఎ) డాక్టర్ చక్రవర్తి బి) వెలుగు నీడలు సి) మూగమనసులు డి) సుడిగుండాలు
♦ యాక్షన్ కింగ్ అర్జున్ శరీరానికి ‘ఒకే ఒక్కడు’లోని ఫైట్ సీన్‌లో నిప్పు అంటుకుంటుంది? ఫైట్ చేస్తూ అర్జున్ బురదలోకి దూకుతారు. ఆ యాక్షన్ సీక్వెన్స్‌కి ఫైట్ మాస్టర్ ఎవరో తెలుసా?
ఎ) పీటర్ హెయిన్స్ బి) రామ్–లక్ష్మణ్ సి) విజయన్ డి) కణల్ కన్నన్
♦ అందాల రాక్షసి’ ఫేమ్, హీరో రాహుల్ రవీంద్రన్ భార్య ఫేమస్ సింగర్. డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. ఆమె ఎవరో తెలుసా?
ఎ) చిన్మయి బి) సునీత సి) గీతా మాధురి డి) ప్రణవి
♦ ‘ఖడ్గం’లో సోనాలి బింద్రేకు డబ్బింగ్ చెప్పిన ఒకప్పటి హీరోయిన్, ఇప్పటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరు?
ఎ) రాశీ బి) సరిత సి) రేవతి డి) రమ్యకృష్ణ
♦ నాగార్జున ‘నేనున్నాను’ సినిమాకు ఎం.ఎం. కీరవాణి స్వరకర్త. కానీ, ఆయనకంటే ముందు మరో సంగీత దర్శకుణ్ణి తీసుకున్నారు. రెండు పాటల రికార్డింగ్ కూడా పూర్తయిన తర్వాత చిత్రబృందంతో మనస్పర్థల కారణంగా పక్కకు తప్పుకున్న ఆ సంగీత దర్శకుడు ఎవరు?
ఎ) చక్రి బి) ఆర్పీ పట్నాయక్ సి) మణిశర్మ డి) దేవిశ్రీ ప్రసాద్
♦ సూపర్‌స్టార్ కృష్ణ ఏసుక్రీస్తుగా నటించిన ఈ స్టిల్ ఏ సిన్మాలోనిది?
ఎ) శాంతి సందేశం బి) కరుణామయుడు సి) తొలి కిరణం డి) ఏసు మహిమలు
♦ ఈ ఫొటోలోని చిన్నారి ఓ హీరో కూతురు. ఆమె నటి కూడా! ఎవరో చెప్పుకోండి?
ఎ) డి. సుప్రియ బి) మంజుల సి) నీహారిక డి) మంచి లక్ష్మి
మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి!
సమాధానాలు:
1) ఎ 2) సి 3) ఎ 4) డి 5) సి 6) సి 7) ఎ 8) బి 9) బి 10) బి 11) బి 12) ఎ 13) సి 14) డి 15) ఎ 16) ఎ 17) డి 18) బి 19) ఎ 20) డి