నా అందానికి అదే కారణం: నటి
అప్పుడప్పుడు తెలుగు సినిమాల్లో మెరుపులు మెరిపించే బహుభాష నటి సంజన అందానికి కారణమేమిటో తెలుసా..
వైట్‌ఫీల్డ్(బెంగళూరు): అప్పుడప్పుడు తెలుగు సినిమాల్లో మెరుపులు మెరిపించే బహుభాష నటి సంజన అందానికి కారణమేమిటో తెలుసా.. ఆశావహ దృక్పథమేనట. నగరంలో ఒక చికెన్ ఫ్రై ఔట్‌లెట్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె కోడిమాంసాన్ని ఆరగించారు. మీడియాతో మాట్లాడుతూ తనకు చికెన్ అంటే ఇష్టమని తెలిపారు.
అయితే గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్నాను కాబట్టి ఎంత తిన్నా ఉదయం ఎక్సర్‌సైజ్‌లు కచ్చితంగా చేస్తానన్నారు. ఆశావాద ధృక్పథం తన సౌందర్య రహస్యమని చెప్పారు.