బాలీవుడ్ దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన చివరి సినిమా ‘దిల్ బేచారా’ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ నెల 24న ఓటీటీలో విడుదలైన ఈ మూవీ అద్భుతమైన రేటింగ్‌తో దూసుకుపోతూ రికార్డులు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో మ్యానీ పాత్రలో ఒదిగిపోయిన సుశీ.. నటుడిగా మరో మెట్టు ఎక్కాడంటూ సెలబ్రిటీలు, సహచర నటులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే సినిమాలోలాగే తన జీవితం విషాదంగా ముగిసిపోవడం బాధాకరమంటూ అతడితో ఉన్న జ్ఞాపకాల గురించి సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉద్వేగానికి లోనవుతున్నారు. ఈ క్రమంలో దిల్ బేచారాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సంజనా సంఘీ సైతం సుశాంత్‌తో తనకు ఉన్న బెస్ట్ మూమెంట్స్ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.(దిల్ బేచారా: కంటతడి పెట్టించిన సుశాంత్)
‘‘ఉదయం 4:30 : తారే గిన్ షూట్‌లో మ్యానీ ఓ కునుకు తీశాడు. తన భుజాన్ని అరువిచ్చిన కిజీ.. ఎప్పటిలాగే ఆలోచనల్లో మునిగిపోయింది’’అంటూ సినిమాలోని తమ పాత్రల పేర్లు, స్వభావాన్ని ప్రస్తావిస్తూ ఫొటోను షేర్ చేశారు. మూవీ సెట్లో తాను గడిపిన అద్భుతమైన క్షణాలు ఇవేనని పేర్కొన్నారు. కాగా జూన్ 14న సుశాంత్ ముంబైలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తీవ్ర భావోద్వేగానికి లోనైన సంజన.. సుశాంత్ ఇలా చేయకుండా ఉండాల్సింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక లాక్‌డౌన్ కారణంగా అవకాశాలు లేకపోవడంతో ఇటీవల ఆమె ముంబైని వీడి స్వస్థలం ఢిల్లీకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.(బై ముంబై.. వెళ్లిపోతున్నా: హీరోయిన్)
Comments
Please login to add a commentAdd a comment