సాఫ్ట్వేర్ యువతిపై లైంగిక దాడి యత్నం | Rape Attempt on Madhapur Techie | Sakshi
Sakshi News home page

సాఫ్ట్వేర్ యువతిపై లైంగిక దాడి యత్నం

Published Sun, Oct 20 2013 9:35 AM | Last Updated on Tue, Aug 14 2018 3:14 PM

సాఫ్ట్వేర్ యువతిపై లైంగిక దాడి యత్నం - Sakshi

సాఫ్ట్వేర్ యువతిపై లైంగిక దాడి యత్నం

హైదరాబాద్‌: ఓ సాఫ్ట్వేర్ యువతిపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన రాష్ట్ర రాజధానిలో కలకలం రేపింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన చోటు చేసుకుంది. గుంటూరు జిల్లాకు చెందిన ఆ యువతి హైటెక్ సిటీలోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ గౌలిదొడ్డిలోని హాస్టల్లో ఉంటుంది.

శుక్రవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఇనార్బిట్‌ మాల్‌లో షాపింగ్ చేసుకుని, హాస్టల్కు వెళ్లేందుకు రోడ్డుపై నుంచుంది. లిఫ్ట్ ఇస్తానంటూ ఓ క్యాబ్ రావడంతో అందులోకి ఎక్కింది. క్యాబ్ డ్రైవర్ ఆ యువతిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించి, తప్పించుకుని వచ్చి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement