గాంధీలో శిశువు కిడ్నాప్ కలకలం
హైదరాబాద్: గాంధీ ఆసుపత్రిలో శిశువును కిడ్నాప్ చేసేందుకు ఓ మహిళ యత్నిచింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అప్పడే పసికందును కిడ్నాప్ చేసేందుకు మేరీ మహిళ యత్నించింది. కిడ్నాప్ చేసిన పాపను ఆటోలో తీసుకెళ్తుండగా అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది ఆమెను పట్టుకున్నారు. పాపను తల్లిదండ్రులకు అప్పగించి కిడ్నాప్ కు యత్నించిన మహిళను చిలకలగూడ పోలీసులకు అప్పజెప్పారు. పోలీసలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.