పొన్నవోలు కిడ్నాప్ యత్నంపై బార్ అసోసియేషన్ ఖండన
హైదరాబాద్: హైకోర్టు బార్ అసోసియేషన్ బుధవారం మధ్యాహ్నం అత్యవసర భేటీ అయింది. ఈ భేటిలో లాయర్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కిడ్నాప్ యత్నాన్ని ఖండిస్తూ హైకోర్టు బార్ అసోసియేషన్ తీర్మానం చేసింది.
పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కిడ్నాప్ యత్నంపై తెలంగాణ, ఏపీ డీజీపీలకు ఫ్యాక్స్ ద్వారా ఫిర్యాదు చేస్తామని హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గిరిధరరావు మీడియాకు తెలిపారు.
నెల్లూరు జిల్లా పరిషత్ ఎన్నికల్లో జరిగిన అరాచకాలను హైకోర్టుకు విన్నవించిన న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డిని కిడ్నాప్‌యత్నం జరిగింది. దీనిపై ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఎన్నిక నిర్వహణకు కోర్టు ప్రత్యేక పరిశీలకుడిని నియమించాలని, ఎన్నికలు సజావుగా జరపాలని ఆదేశాలు పొందిన నేపథ్యంలో కిడ్నాప్ కు కొందరు ప్రయత్నించారు. ఈ నెల 5న జెడ్పీ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ గొడవలు సృష్టించి, ఎన్నికలను వాయి దా వేయించిన విషయం తెలిసిందే.
ఈ కేసును ప్రజాహిత వ్యాజ్యంగా దాఖలు చేసిన న్యాయవాది సుధాకర్‌రెడ్డిని మంగళవారం హైదరాబాద్‌లో కిడ్నాప్ చేసే ప్రయత్నం చేసినట్లు తెలిసింది.