అపహరణకు గురికాబోయిన చిన్నారి తేజ
కశింకోట (అనకాపల్లి): మండలంలోని చింతలపాలెం గ్రామంలో నిద్రపోతున్న పసి బాలుడిని బుధవారం అర్ధరాత్రి ముగ్గురు దొంగల ముఠా అపహరించడానికి ప్రయత్నించింది. ప్రజలు అ ప్రమత్తం కావడంతో బాలుడు దక్కాడు. స్థానికులు అందించిన వివరాల ప్రకారం.. చింతలపాలెంకు చెందిన బుదిరెడ్డి గణేష్, కుమారి దంపతులకు పాప, బాబు ఉన్నారు. వీరు ఎప్పటిలాగే ఇంటి మేడపై నిద్రపోతున్నారు. అర్ధరాత్రి సమయంలో ముగ్గురు దొంగలు ముసుగు వేసుకొని వచ్చారు. వారిలో ఇద్దరు ఇంటి కింద గమని స్తుండగా, ఒక వ్యక్తి మేడపైకి ఎక్కి నిద్రిస్తున్న బా లుడు తేజ(2)ను ఎత్తుకొని కిందికి వేగంగా వస్తూ అక్కడ ఉన్న వంట పాత్రలను తన్నుకున్నాడు. దీంతో శబ్దం కావడంతో మెలకువ వచ్చి గణేష్ చూసే సరికి బాలుడిని దొంగలు ఎత్తుకు పోవడానికి ప్రయత్నించడాన్ని గమనించాడు.
వెంటనే తేరుకొని దొంగకాలు పట్టుకొని కేకలు చేశాడు. దీంతో చుట్టుపక్కల వారు రావడంతో బాలుడిని కింద పడేసి వదిలించుకొని పరారయ్యారు. బాలుడికు స్వల్పంగా గాయం కావడంతో స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించారు. ఈ విషయమై పోలీసులకు సమాచారం అందివ్వడంతో ఎస్‌ఐ బి.మధుసూదనరావు సంఘటన స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. పోలీసు గస్తీని ఏర్పాటు చేసి రక్షణ కల్పించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిగితే స్థానికులా? దొంగల ముఠా వచ్చిందా? అనే విషయాలు వెల్లడి కాగలవన్నా రు. పిల్లలను ఎత్తుకుపోతున్నారన్న ప్రచారాన్ని పోలీసులు వదంతులుగా కొట్టి పారేసిన నేపథ్యంలో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment