విశాఖపట్నం: సస్పెక్టడ్ షీటు ఉన్న ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. తెల్లారేసరికి రక్తపుమడుగులో ఉన్న అతడిని చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాలివీ.. దుర్గాబజార్‌లో నివాసముంటున్న ఏరుసుమాండాల ఆదినారాయణ అలియాస్ ఆది(30) ఆటో డ్రైవర్. ఆయన మంగళవారం రాత్రి స్నేహతుడి పుట్టినరోజు పారీ్టకి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత పార్టీ ముగించుకుని ఇంటికి వస్తున్నాడు. అదే సమయంలో బాలాజీనగర్ ప్రాంతంలోని జీవీఎంసీ సులభ్ కాంప్లెక్స్ వద్ద కూర్చున్న అదే ప్రాంతానికి చెందిన జగదీ‹Ù, శివ అనే ఇద్దరు యువకులను కలిశాడు.
వారితో ఆదికి పరిచయం లేకపోయినా.. మాటలు కలిపి అక్కడే కొద్దిసేపు ఉన్నాడు. ఈ క్రమంలో వారిద్దరితో ఆదికి చిన్నపాటి గొడవ జరిగింది. ఆ గొడవ పెరిగి కొట్లాటకు దారి తీసింది. ఆది అందుబాటులో ఉన్న కర్ర, బీరు బాటిల్ తీసుకుని వారిద్దరినీ కొట్టాడు. దీంతో ఆ యువకులు ఆదిపై తిరగబడి దాడి చేశారు. కర్రతో అతని తలపై బలంగా కొట్టారు. దీంతో ఆది సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. బుధవారం ఉదయం ఆరు గంటలకు స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఆరిలోవ పోలీసులు.. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. రక్తం మడుగులో ఉన్న ఆది మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. కాగా.. ఆదిని హత్య చేసిన జగదీష్, శివ పోలీసులకు లొంగిపోయారు. తాము ఆదిని హత్య చేశామని ఒప్పుకున్నారు. ఆది తమ వద్దకు వచ్చి కావాలనే గొడవపడి మమ్మల్ని కొట్టడంతో.. దాడి చేసినట్లు పోలీసులకు తెలిపారు.
వారిద్దర్నీ అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సోమశేఖర్ తెలిపారు.ఆదిపై సస్పెక్టడ్ షీట్ : రెండేళ్ల కిందట ఆరిలోవ కాలనీలో ఓ యువకుడిని హత్య చేసిన కేసులో ఆది నిందితుడని సీఐ సోమశేఖర్ తెలిపారు. దీంతో ఆయనపై సస్పెక్టడ్ షీటు తెరిచినట్లు తెలిపారు. ప్రతి ఆదివారం రౌడీ షీటర్లతో పాటు ఆది కూడా స్టేషన్‌కు వచ్చి రికార్డులో సంతకం చేస్తుండేవాడన్నారు. ఇప్పుడు ఈ హత్యకు పాత గొడవలు కారణమా.. యాదృచి్ఛకంగా యువకులు దాడి చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆది తండ్రి బంగారయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment