![Girl Dies Due To Auto Driver Reckless Driving Karnataka - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/20/Crime_0128.jpg.webp?itok=cSwgz702)
బనశంకరి(బెంగళూరు): గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసే ఆటోడ్రైవరు నిర్లక్ష్యానికి బాలిక బలైంది. ఈ ఘటన కామాక్షీపాళ్య ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. నాగమంగళకు చెందిన దంపతులు కావేరిపురలో నివాసం ఉంటున్నారు. వీరికి నాలుగేళ్ల కుమార్తె భువన ఉంది. శనివారం బాలిక భువనకు కొబ్బరినీళ్లు తాగించడానికి తల్లి తన వెంట తీసుకెళ్లింది. (చదవండి: ప్రేమ పెళ్లి.. రాకేశ్ నువ్వొక సైకో, శాడిస్ట్, పనికిమాలిన వాడివి.. )
ఇదే సమయంలో ఓ ఆటో డ్రైవర్ వాహనానికి హ్యాండ్ బ్రేక్ వేయకుండా కిందకు దిగడంతో ఆటో వేగంగా ముందుకు వెళ్లి తల్లి కూతురిని ఢీకొంది. కిందపడిన బాలిక గొంతుపై ఆటో వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. పోలీసులు ఆటో డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment