reckless driving
-
Facebook Live: పోనీయ్.. 300 కి.మీ.లు దాటాలి
లక్నో: బీఎండబ్ల్యూ కారు.. మెరుపు వేగం.. నిర్లక్ష్యపు డ్రైవింగ్.. ఫేస్బుక్ లైవ్‌లో అత్యుత్సాహం.. ఇవన్నీ కలిసి నలుగురి ప్రాణాలను అనంత వాయువుల్లో కలిపేశాయి. 230 కిలోమీటర్ల వేగంతో కారును నడుపుతూ నలుగురు యువకులు ప్రాణాలు బలిచేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై శుక్రవారం సుల్తాన్పూర్ వద్ద జరిగింది. ఈ ప్రమాదం తాలూకు వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఆనంద్ ప్రకాశ్(35), అఖిలేశ్ సింగ్(35), దీపక్ కుమార్(37), మరో వ్యక్తి బీఎండబ్ల్యూ కారులో ఎక్స్‌ప్రెస్ హైవేపై అత్యంత వేగంతో దూసుకెళ్తున్నారు. దీంతో అందులోని వ్యక్తి.. ‘ స్పీడ్ మరింత పెంచు. స్పీడ్ 300 కి.మీ.లు దాటాలి. మనం ఫేస్బుక్ లైవ్‌లో ఉన్నాం’ అని డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తితో అన్నాడు. అప్పటికే ఆ వేగంతో భయపడిన కారులోని వ్యక్తి.. ‘మనం నలుగురం చస్తాం. నెమ్మదిగా పోనీయ్’ అని అరిచాడు. దీంతో డ్రైవర్.. భయపడే వ్యక్తిని వారిస్తూ ‘ అరవకు. నేను అంతటి వేగంతో నడిపి చూపిస్తా’ అని కోప్పడ్డాడు. ఈ వాగ్వాదం నడుమే కారు 230 కి.మీ.ల వేగంలో ప్రయాణిస్తూ ఎదురుగా వస్తున్న ట్రక్‌ను ఢీకొట్టింది. కారు టాప్, ముందుభాగం పగిలిపోయి కారులోని నలుగురూ ఛిద్రమై దూరంగా పడిపోయాడు. అక్కడిక్కడే మరణించారు. -
ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం.. కొబ్బరినీళ్లు తాగేందుకు వచ్చిన బాలికపై..
బనశంకరి(బెంగళూరు): గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసే ఆటోడ్రైవరు నిర్లక్ష్యానికి బాలిక బలైంది. ఈ ఘటన కామాక్షీపాళ్య ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. నాగమంగళకు చెందిన దంపతులు కావేరిపురలో నివాసం ఉంటున్నారు. వీరికి నాలుగేళ్ల కుమార్తె భువన ఉంది. శనివారం బాలిక భువనకు కొబ్బరినీళ్లు తాగించడానికి తల్లి తన వెంట తీసుకెళ్లింది. (చదవండి: ప్రేమ పెళ్లి.. రాకేశ్ నువ్వొక సైకో, శాడిస్ట్, పనికిమాలిన వాడివి.. ) ఇదే సమయంలో ఓ ఆటో డ్రైవర్ వాహనానికి హ్యాండ్ బ్రేక్ వేయకుండా కిందకు దిగడంతో ఆటో వేగంగా ముందుకు వెళ్లి తల్లి కూతురిని ఢీకొంది. కిందపడిన బాలిక గొంతుపై ఆటో వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. పోలీసులు ఆటో డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. -
తగ్గిన ప్రమాద మరణాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వివిధ ప్రమాదాల కారణంగా సంభవించే మరణాలు 2019తో పోలిస్తే 2020లో 18.3 శాతం తగ్గాయి. ప్రకృతి వైపరీత్యా లు, రహదారి, రైల్వే, ఇతర ప్రమాదాల్లో 2019లో 17,938 మంది మృతిచెందగా, 2020లో ఆ మరణాల సంఖ్య 14,653కి తగ్గింది. మృతుల్లో 12,062 మంది పురుషులు, 2,590 మంది మహిళలు, ఒక ట్రాన్స్‌జెండర్ ఉన్నారు. ప్రమాద మరణాలు–ఆత్మహత్యల నివేదిక–2020ను జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్సీఆర్బీ) విడుదల చేసింది. ఆ నివేదికలో పేర్కొన్న వివరాల ప్రకారం ప్రమాదాల్లో మరణించిన వారిలో 30నుంచి 45 ఏళ్ల వయసు వారు అత్యధికంగా 4,624 మంది ఉన్నారు. రోడ్డు ప్రమాదాలు 13.3 శాతం తగ్గుదల 2019తో పోలిస్తే రోడ్డు ప్రమాదాలు 13.3 శాతం తగ్గాయి. 2020లో 17,924 రోడ్డు ప్రమాదాలు సంభవించగా.. 19,675 మంది గాయాల పాలయ్యారు. 7,039 మంది మృతి చెందారు. సాయంత్రం 7 నుంచి రాత్రి 9 గంటల మధ్య అత్యధిక ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఆ సమయంలో 7,269 ప్రమాదాలు జరిగాయి. అదేవిధంగా 611 రైలు ప్రమాదాల్లో 613 మంది మరణించారు. అతివేగం.. నిర్లక్ష్యమే కారణం అతి వేగంతో 12,344 ప్రమాదాలు, నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల 3,300 ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వాతావరణ ప్రతికూల పరిస్థితుల వల్ల 414 మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల 154, జంతువులను తప్పించబోయి 67 ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. రహదారులు సరిగా లేకపోవడం వల్ల జరిగిన ప్రమాదాలు 20 మాత్రమే ఉన్నాయి. ఇతర కారణాలతో మిగిలిన ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. -
భారత అండర్-19 క్రికెట్ జట్టు కెప్టెన్ అరెస్ట్
పట్నా: అండర్-19 ప్రపంచ కప్‌నకు ముందు భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. నిర్లక్ష్యంగా కారును నడిపి ఆటోను ఢీకొట్టిన కేసులో భారత్ అండర్-19 జట్టు కెప్టెన్ ఇషాన్ కిషన్‌ను పట్నా పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం కిషన్ వేగంగా కారును నడుపుతూ ఆటోను ఢీకొట్టడంతో అందులోని ప్రయాణికులు గాయపడ్డారు. అంతేగాక ప్రమాద స్థలంలో కిషన్ ఘర్షణకు దిగాడు. దీంతో స్థానికులు కిషన్‌ను చితకబాది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కిషన్‌ను అరెస్ట్ చేసి, కారును సీజ్ చేశారు. బిహార్‌లోని నవడా జిల్లాకు చెందిన కిషన్.. జార్ఖండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దేశవాళీ పోటీల్లో అద్భుతంగా రాణించాడు. రంజీ ట్రోఫీలో పది మ్యాచ్‌ల్లో 736 పరుగులు చేశాడు. దీంతో గత డిసెంబర్లో భారత అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఈ నెల 27న బంగ్లాదేశ్‌లో అండర్-19 ప్రపంచ కప్ ఆరంభకానుంది. ఈ తరుణంలో కిషన్ అరెస్ట్ కావడంతో భారత జట్టుకు ప్రతికూలంగా మారింది. -
తిరిగొచ్చేదాక డౌటే?
నెల్లూరు (రవాణా) : అస్తవ్యస్తమైన రోడ్లు, నిర్లక్ష్యపు డ్రైవింగ్, నిబంధనలు అమలు చేయని అధికారులు వెరసి అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇంటినుంచి పనిమీద వెళ్లిన వారు తిరిగి ఇంటికి చేరుకుంటారో లేదోనన్న భయం ప్రస్తుతం జనాన్ని వెంటాడుతోంది. మృత్యువు ఎప్పుడు ఏరూపంలో కబళిస్తుందో ఎవరికి అంతుపట్టని పరిస్థితి. ఓవైపు నిత్యం తనిఖీలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నా మరోవైపు పరిమితికి మించి జనాన్ని ఎక్కించుకుని డ్రైవర్లు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద జరిగిన ప్రమాదమే ఇందుకు నిదర్శనం. ఈ ప్రమాదంలో 21 మంది అమాయకులు ప్రాణాలు పొగొట్టుకున్న విషయం తెలిసిందే. వాహనాల మయం జిల్లాలో మొత్తం 5 లక్షలకుపైగా వివిధ రకాల వాహనాలు ఉన్నాయి. వాటిలో 2.80 లక్షల బైక్‌లు, 30వేల ఆటోలు, ట్రాక్టర్లు 29,000, లారీలు 19,000, కార్లు 36,000, క్యాబ్‌లు, మాక్సీక్యాబ్‌లు 3వేలు, టౌన్ బస్సులు 81, టూరిస్టు, ట్రావెల్స్ 170, మిగిలినవి ఇతర వాహనాలున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. జిల్లాలో 169 కి.మీ మేర హైవే ఉంది. హైవేతో పాటు ముంబై, బెంగళూరు వెళ్లే ప్రధానరోడ్లు ఉన్నాయి. అయితే జిల్లాలో నిత్యం ఎక్కడో ఒకచో ట ప్రమాదాలు జరగుతున్నాయి. ఈప్రమాదాల్లో పదులసంఖ్యలో ప్రాణా లు గాలిలో కలిసిపోతున్నాయి. పోలీ సులు, రవాణా అధికారులు నిత్యం తని ఖీలు చేస్తున్నామని చెబుతున్నా ప్రమాదాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. పరిమితికి మించి ప్రయాణం... ప్రధానంగా ఆటోలు, మాక్సీక్యాబ్‌లు, ప్రైవేటు బస్సులు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని వివిధ ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. ప్రధానంగా దూరప్రాంతాలకు మాక్సీక్యాబ్లను వినియోగిస్తున్నారు. ఇన్నోవాలో ఏడుగురు, తుపాన్ వాహనంలో 10 మంది, మాక్సీక్యాబ్లో ఎనిమిదిమంది, టెంపోలో 12మందిని మాత్రమే ఎక్కిం చుకోవాల్సి ఉంది. అయితే వాహనాన్ని బట్టి 10నుంచి 25మందికిపైగా ఎక్కిం చుకుని రోడ్డెక్కుతున్నారు. ప్రమాదాలకు కారకులవుతున్నారు. అదే ఆటోలో 10మందికి పైగా ఎక్కించుకుని ప్రయా ణిస్తున్నారు. అలాగే హైవేపై రాత్రివేళల్లో ఇష్టారీతిన వాహనాలను ఆపడం వల్ల కూడా ప్రమాదాలు పెరుగుతున్నాయి. వాటిని నియంత్రించాల్సిన హైవే పెట్రోలింగ్ నామమాత్రంగా మారింది. హైవే నిబంధనలు పట్టించుకోరు హైవేపైకి ఆటో రాకూడదన్న నిబంధన ఉంది. అయితే దాదాపు ఎక్కువ ఆటోలు జాతీయ రహదారిపైనే నిత్యం తిరుగుతుంటాయి. ప్రధానంగా పాఠశాలల నుంచి కళాశాలల వరకు విద్యార్థులు పరిమితికి మించి ప్రయాణం చేస్తున్నారు. ప్రధానంగా డ్రైవర్ పక్కన ఎవరిని కూర్చోబెట్టకూడదన్న నిబందన ఉన్నా ఎవరూ పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. అధికారుల నామమాత్రపు తనిఖీలు మద్యం తాగి డ్రైవింగ్ చేయడం, హెల్మెట్ ధరించకపోవడం, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం, సుదూర ప్రాంతాలకు ఒక్కరే డ్రైవింగ్, మితిమీరిన వేగం తదితర కారణాలతో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నా యి. ప్రమాదం జరిగిన రోజు అధికారులు హడావుడి తర్వాత పట్టించుకోవడం లేదు. దీంతో వాహనదారులు నిబంధనలను గాలికి వదిలేసి ఇష్టారాజ్యంగా నడుపుతున్నారు. పోలీసు, రవాణాశాఖ అధికారులు సంయుక్తంగా నిత్యం తనిఖీలు చేస్తే తప్ప ప్రమాదాలు తగ్గే అవకాశం లేదని పలువురు చెబుతున్నారు. అలాగే ప్రధానంగా జాతీయ రహదారికి మరమ్మతులు జరుగుతున్న నేపథ్యంలో పలుచోట్ల స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేశారు. కానీ స్పీడుబ్రేకర్లు ఉన్న ప్రాంతంలో ఎలాంటి బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు వెంటనే వాటిపై దృష్టిపెట్టి ప్రమాదాలను నివారించాల్సిన అవసరముంది. -
నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో నిండు ప్రాణం బలి
గన్నవరం : నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. మితిమిరిన వేగంతో దూసుకువచ్చిన కారు రోడ్డుపై వెళ్తున్న ఇద్దరిని ఢీకొట్టి పక్కనే ఉన్న డ్రెయిన్‌లో దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక దావాజిగూడెం రోడ్డులో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటన వివరాలీలా వున్నాయి. కేసరపల్లి శివారు వీఎన్. పురం కాలనీకి చెందిన జలసూత్రం కృష్ణ(60) స్థానిక వీఎస్. సెయింట్‌జాన్స్ హైస్కూల్లో తోటమాలిగా పనిచేస్తున్నాడు. నైట్‌డ్యూటీలో ఉన్న కృష్ణ సోమవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో టీ తాగేందుకు సైకిల్‌పై సినిమాహాల్ సెంటర్‌కు వెళ్లాడు. కొద్ది సేపటి తర్వాత సమీపంలోని అపార్ట్మెంట్లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న కొండా కొండలరావుతో కలిసి తిరిగి బయలుదేరారు. దావాజిగూడెం రోడ్డులోని ఇంద్రప్రస్థ కాంప్లెక్స్ వద్దకు రాగానే నాగవరప్పాడు నుంచి గన్నవరం వైపు వేగంగా దూసుకువచ్చిన కారు వీరిద్దరినీ ఢీకొంది. అనంతరం కారు పక్కనే సైడ్ డ్రెయిన్‌లోకి దూసుకువెళ్ళింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన కృష్ణ, కొండలరావును విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కృష్ణ పరిస్ధితి విషమించడంతో కొద్దిసేపటికే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారు డ్రైవర్ సత్యనారాయణ నిత్రమత్తులో కారు నడపడం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు విచారణలో తేలింది. -
ఇద్దరిని బలిగొన్న కొత్తబండి సరదా
చైతన్యపురి స్టేషన్ పరిధిలో ఘటన చైతన్యపురి: కొత్త బండి సరదా, నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఇద్దరు యువకులను బలితీసుకుంది. నాగోల్ చౌరస్తాలో గురువారం అర్ధరాత్రి ఈ దుర్ఘటన జరిగింది. చైతన్యపురి ఎస్ఐ సత్యనారాయణ కథనం ప్రకారం... వెస్ట్‌మారేడ్‌పల్లి అల్లాడి పెంటయ్యనగర్‌లో నివాసం ఉండే బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి అంబూరికృష్ణ కుమారుడు భరత్(23) ఇటీవల పల్సర్ బైక్ కొన్నాడు. భరత్ శుక్రవారం రాత్రి నల్లగొండ జిల్లా బీబీనగర్‌కు చెందిన తన స్నేహితుడు అనిల్(21)ను తన బైక్‌పై ఎక్కించుకొని, మరో రెండు బైక్‌లపై నలుగురు స్నేహితులతో కలిసి విందు చేసుకునేందుకు ఉప్పల్ వచ్చాడు. అర్ధరాత్రి ఒంటి గంటకు ఐస్‌క్రీం తిందామని అందరూ కలిసి అక్కడి నుంచి ఎల్బీనగర్ వైపు వచ్చారు. అక్కడి నుంచి తిరిగ అందరివి కొత్త వాహనాలు కావటంతో వేగంగా వెళ్తున్నారు. తిరిగి వెళ్లే క్రమంలో నాగోల్ చౌరస్తాలో కొత్తపేట వైపు మలుపు తీసుకుంటున్న డీసీఎం వ్యాన్ (ఏపీ12వీ0754)ను భరత్ పల్సర్ వాహనాన్ని ఢీకొంది. దీంతో బైక్ నడుపుతున్న భరత్‌కు తీవ్రగాయాలు కావడంతో అక్కడిక క్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ అనిల్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందాడు. శుక్రవారం పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
డ్రైవర్ నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి
కర్నూలు : నిర్లక్ష్యంతో డ్రైవర్ బస్ నడపడంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన కర్నూల జిల్లా నందికొట్కూరు ఆర్టీసీ డిపోలో మంగళవారం ఉదయం జరిగింది. వివరాలు... ఆర్టీసీ డ్రైవర్ బస్‌ను రీవర్స్ తీస్తుండగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న కిషోర్(20) అనే వ్యక్తి తలపై వెళ్లడంతో అక్కడకక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాడు.