భారత అండర్-19 క్రికెట్ జట్టు కెప్టెన్ అరెస్ట్
పట్నా: అండర్-19 ప్రపంచ కప్నకు ముందు భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. నిర్లక్ష్యంగా కారును నడిపి ఆటోను ఢీకొట్టిన కేసులో భారత్ అండర్-19 జట్టు కెప్టెన్ ఇషాన్ కిషన్ను పట్నా పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం కిషన్ వేగంగా కారును నడుపుతూ ఆటోను ఢీకొట్టడంతో అందులోని ప్రయాణికులు గాయపడ్డారు. అంతేగాక ప్రమాద స్థలంలో కిషన్ ఘర్షణకు దిగాడు. దీంతో స్థానికులు కిషన్ను చితకబాది పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు కిషన్ను అరెస్ట్ చేసి, కారును సీజ్ చేశారు. బిహార్లోని నవడా జిల్లాకు చెందిన కిషన్.. జార్ఖండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దేశవాళీ పోటీల్లో అద్భుతంగా రాణించాడు. రంజీ ట్రోఫీలో పది మ్యాచ్ల్లో 736 పరుగులు చేశాడు. దీంతో గత డిసెంబర్లో భారత అండర్-19 జట్టుకు కెప్టెన్గా ఎంపిక చేశారు. ఈ నెల 27న బంగ్లాదేశ్లో అండర్-19 ప్రపంచ కప్ ఆరంభకానుంది. ఈ తరుణంలో కిషన్ అరెస్ట్ కావడంతో భారత జట్టుకు ప్రతికూలంగా మారింది.