తిరిగొచ్చేదాక డౌటే? | Road accidents | Sakshi
Sakshi News home page

తిరిగొచ్చేదాక డౌటే?

Published Sun, Jun 14 2015 1:30 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

తిరిగొచ్చేదాక డౌటే? - Sakshi

తిరిగొచ్చేదాక డౌటే?

నెల్లూరు (రవాణా) : అస్తవ్యస్తమైన రోడ్లు, నిర్లక్ష్యపు డ్రైవింగ్, నిబంధనలు అమలు చేయని అధికారులు వెరసి అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇంటినుంచి పనిమీద వెళ్లిన వారు తిరిగి ఇంటికి చేరుకుంటారో లేదోనన్న భయం ప్రస్తుతం జనాన్ని వెంటాడుతోంది. మృత్యువు ఎప్పుడు ఏరూపంలో కబళిస్తుందో ఎవరికి అంతుపట్టని పరిస్థితి. ఓవైపు నిత్యం తనిఖీలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నా మరోవైపు పరిమితికి మించి జనాన్ని ఎక్కించుకుని డ్రైవర్లు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద జరిగిన ప్రమాదమే ఇందుకు నిదర్శనం. ఈ ప్రమాదంలో 21 మంది అమాయకులు ప్రాణాలు పొగొట్టుకున్న విషయం తెలిసిందే.

 వాహనాల మయం
 జిల్లాలో మొత్తం 5 లక్షలకుపైగా వివిధ రకాల వాహనాలు ఉన్నాయి. వాటిలో 2.80 లక్షల బైక్‌లు, 30వేల ఆటోలు, ట్రాక్టర్లు 29,000, లారీలు 19,000, కార్లు 36,000, క్యాబ్‌లు, మాక్సీక్యాబ్‌లు 3వేలు, టౌన్ బస్సులు 81, టూరిస్టు, ట్రావెల్స్ 170, మిగిలినవి ఇతర వాహనాలున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. జిల్లాలో 169 కి.మీ మేర హైవే ఉంది. హైవేతో పాటు ముంబై, బెంగళూరు వెళ్లే ప్రధానరోడ్లు ఉన్నాయి. అయితే జిల్లాలో నిత్యం ఎక్కడో ఒకచో ట ప్రమాదాలు జరగుతున్నాయి. ఈప్రమాదాల్లో పదులసంఖ్యలో ప్రాణా లు గాలిలో కలిసిపోతున్నాయి. పోలీ సులు, రవాణా అధికారులు నిత్యం తని ఖీలు చేస్తున్నామని చెబుతున్నా ప్రమాదాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు.

 పరిమితికి మించి ప్రయాణం...
 ప్రధానంగా ఆటోలు, మాక్సీక్యాబ్‌లు, ప్రైవేటు బస్సులు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని వివిధ ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. ప్రధానంగా దూరప్రాంతాలకు మాక్సీక్యాబ్‌లను వినియోగిస్తున్నారు. ఇన్నోవాలో ఏడుగురు, తుపాన్ వాహనంలో 10 మంది, మాక్సీక్యాబ్‌లో ఎనిమిదిమంది, టెంపోలో 12మందిని మాత్రమే ఎక్కిం చుకోవాల్సి ఉంది. అయితే వాహనాన్ని బట్టి 10నుంచి 25మందికిపైగా ఎక్కిం చుకుని రోడ్డెక్కుతున్నారు. ప్రమాదాలకు కారకులవుతున్నారు. అదే ఆటోలో  10మందికి పైగా ఎక్కించుకుని ప్రయా ణిస్తున్నారు. అలాగే హైవేపై రాత్రివేళల్లో ఇష్టారీతిన వాహనాలను ఆపడం వల్ల కూడా ప్రమాదాలు పెరుగుతున్నాయి. వాటిని నియంత్రించాల్సిన హైవే పెట్రోలింగ్ నామమాత్రంగా మారింది.

 హైవే నిబంధనలు పట్టించుకోరు
 హైవేపైకి ఆటో రాకూడదన్న నిబంధన ఉంది. అయితే దాదాపు ఎక్కువ ఆటోలు జాతీయ రహదారిపైనే నిత్యం తిరుగుతుంటాయి. ప్రధానంగా పాఠశాలల నుంచి కళాశాలల వరకు విద్యార్థులు పరిమితికి మించి ప్రయాణం చేస్తున్నారు. ప్రధానంగా డ్రైవర్ పక్కన ఎవరిని కూర్చోబెట్టకూడదన్న నిబందన ఉన్నా ఎవరూ పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు.

 అధికారుల నామమాత్రపు తనిఖీలు
 మద్యం తాగి డ్రైవింగ్ చేయడం, హెల్మెట్ ధరించకపోవడం, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం, సుదూర ప్రాంతాలకు ఒక్కరే డ్రైవింగ్, మితిమీరిన వేగం తదితర కారణాలతో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నా యి. ప్రమాదం జరిగిన రోజు అధికారులు హడావుడి తర్వాత పట్టించుకోవడం లేదు. దీంతో వాహనదారులు నిబంధనలను గాలికి వదిలేసి ఇష్టారాజ్యంగా నడుపుతున్నారు. పోలీసు, రవాణాశాఖ అధికారులు సంయుక్తంగా నిత్యం తనిఖీలు చేస్తే తప్ప ప్రమాదాలు తగ్గే అవకాశం లేదని పలువురు చెబుతున్నారు.

అలాగే ప్రధానంగా జాతీయ రహదారికి మరమ్మతులు జరుగుతున్న నేపథ్యంలో పలుచోట్ల స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేశారు. కానీ స్పీడుబ్రేకర్లు ఉన్న ప్రాంతంలో ఎలాంటి బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు వెంటనే వాటిపై దృష్టిపెట్టి ప్రమాదాలను నివారించాల్సిన అవసరముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement