చైతన్యపురి స్టేషన్ పరిధిలో ఘటన
చైతన్యపురి: కొత్త బండి సరదా, నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఇద్దరు యువకులను బలితీసుకుంది. నాగోల్ చౌరస్తాలో గురువారం అర్ధరాత్రి ఈ దుర్ఘటన జరిగింది. చైతన్యపురి ఎస్‌ఐ సత్యనారాయణ కథనం ప్రకారం... వెస్ట్‌మారేడ్‌పల్లి అల్లాడి పెంటయ్యనగర్‌లో నివాసం ఉండే బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి అంబూరికృష్ణ కుమారుడు భరత్(23) ఇటీవల పల్సర్ బైక్ కొన్నాడు. భరత్ శుక్రవారం రాత్రి నల్లగొండ జిల్లా బీబీనగర్‌కు చెందిన తన స్నేహితుడు అనిల్(21)ను తన బైక్‌పై ఎక్కించుకొని, మరో రెండు బైక్‌లపై నలుగురు స్నేహితులతో కలిసి విందు చేసుకునేందుకు ఉప్పల్ వచ్చాడు.
అర్ధరాత్రి ఒంటి గంటకు ఐస్‌క్రీం తిందామని అందరూ కలిసి అక్కడి నుంచి ఎల్బీనగర్ వైపు వచ్చారు. అక్కడి నుంచి తిరిగ అందరివి కొత్త వాహనాలు కావటంతో వేగంగా వెళ్తున్నారు. తిరిగి వెళ్లే క్రమంలో నాగోల్ చౌరస్తాలో కొత్తపేట వైపు మలుపు తీసుకుంటున్న డీసీఎం వ్యాన్ (ఏపీ12వీ0754)ను భరత్ పల్సర్ వాహనాన్ని ఢీకొంది. దీంతో బైక్ నడుపుతున్న భరత్‌కు తీవ్రగాయాలు కావడంతో అక్కడిక క్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ అనిల్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందాడు. శుక్రవారం పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది.
ఇద్దరిని బలిగొన్న కొత్తబండి సరదా
Published Fri, Mar 20 2015 11:51 PM | Last Updated on Sat, Sep 2 2017 11:09 PM
Advertisement
Advertisement