
హైదరాబాద్: మద్యం మత్తులో అకారణంగా ఓ ఆటో డ్రైవర్ ఓ బాలుడి గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ ఫరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథ నం మేరకు వివరాలిలా ఉన్నాయి. జగద్గిరిగుట్ట కూన మహాలక్ష్మీ నగర్‌లో ఉంటున్న లక్ష్మి, దుర్గయ్య దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. దుర్గయ్య కొన్నేళ్లుగా ఇంటికి రాకపోవడంతో పిల్లలతో కలిసి లక్ష్మి ఒంటరిగా ఉంటోంది.
సోమవారం సాయంత్రం అదే బస్తీకి చెందిన ఆటో డ్రైవర్ యాదగిరి తప్పతాగి, రోడ్డుపై ఆడుకుంటున్న ఆదిత్య (9)తో మాటలు కలిపాడు. అతడికి మాయ మాటలు చెప్పి తనతో తీసుకెళ్లాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే తన జేబులో ఉన్న బ్లేడుతో బాలుడి గొంతు కోశాడు. దీంతో ఆదిత్య కుప్పకూలి పోయాడు. దీనిని గుర్తించిన స్థానికులు బాలుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థి తి విషమించడంతో గాంధీ ఆస్పతికి తరలించారు.
ఆదిత్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బాలుడిని ఎందుకు చంపాలనుకున్నాడో కారణాలు తెలియరాలేదు. యాదగిరిని ఆదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment