తెలంగాణ జూడాల రిలే దీక్షల ప్రారంభం | Telangana junior docters begin Riley strike | Sakshi

తెలంగాణ జూడాల రిలే దీక్షల ప్రారంభం

Oct 26 2014 3:31 AM | Updated on Sep 2 2017 3:22 PM

తెలంగాణ జూడాల రిలే దీక్షల ప్రారంభం

తెలంగాణ జూడాల రిలే దీక్షల ప్రారంభం

తెలంగాణ జూనియర్ డాక్టర్ల రిలే నిరాహార దీక్షలు శనివారం ప్రారంభవుయ్యాయి.

హైదరాబాద్: తెలంగాణ జూనియర్ డాక్టర్ల రిలే నిరాహార దీక్షలు శనివారం ప్రారంభవుయ్యాయి. ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో ప్రారంభమైన జూడాల దీక్షల శిబిరాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య సందర్శించారు. అనంతరం మాట్లా డుతూ 28 రోజులుగా జూనియర్ డాక్టర్లు న్యాయమైన కోర్కెల కోసం చేస్తున్న సమ్మె సహేతుకమైందన్నారు.

కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ కృష్ణ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ జూడాల కన్వీనర్ డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ క్రాంతి, నాగార్జున, రాఘవేంద్ర, ధనుంజయ్, అభిలాష్ పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement