చుండూరు’పై 30న ధర్నా: బొజ్జా తారకం | 30th dharna by chunduru case issue | Sakshi
Sakshi News home page

చుండూరు’పై 30న ధర్నా: బొజ్జా తారకం

Published Thu, May 29 2014 12:17 AM | Last Updated on Wed, Apr 3 2019 6:20 PM

చుండూరు’పై 30న ధర్నా: బొజ్జా తారకం - Sakshi

చుండూరు’పై 30న ధర్నా: బొజ్జా తారకం

హైదరాబాద్,  చుండూరు తీర్పును ఎండగడుతూ ఈనెల 30న ఇందిరా పార్కు వద్ద వివిధ ప్రజా సంఘాలతో కలసి ధర్నా నిర్వహిస్తామని  చుండూరు దళితుల న్యాయ పోరాట కమిటీ కన్వీనర్, సీనియర్ అడ్వొకేట్ బొజ్జా తారకం బుధవారం పేర్కొన్నారు.  23 ఏళ్ల క్రితం జరిగిన చుండూరు దళితుల ఊచకోత కేసును తమ అవసరాల కోసం కేవలం ఏడు రోజుల్లో విచారణ ముగించారని ఆయన మండిపడ్డారు.

జిల్లా స్పెషల్ కోర్టు విధించిన శిక్షలను రద్దు చే స్తూ 8 మంది దళితులను హత్య చేసిన ఒక సామాజిక వర్గానికి చెందిన హంతకులందరూ నిర్దోషులే అంటూ తీర్పు చెప్పడం అనుమానాలకు దారితీస్తుందన్నారు. ఈ తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని ఆయన పేర్కొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement