Public groups
-
ప్రజాసంఘాలు లేకుంటే ఏకపక్ష పాలనే: ఈటెల
హైదరాబాద్: ప్రజాసంఘాలు లేకపోతే పాలన ఏకపక్షంగా సాగుతుందని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. మంచి సలహాలతో ప్రజాసంఘాలు ప్రభుత్వాలకు మార్గదర్శనం చేయాలని కోరారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో డీటీఎఫ్ ఆధ్వర్యంలో ‘తెలంగాణ రాష్ట్రం లో పాఠశాల విద్య’ అంశంపై సదస్సు జరిగింది. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని ఈటెల చెప్పారు. -
న్యాయ వ్యవస్థకే మచ్చ
చుండూరు తీర్పుపై లెఫ్ట్, ప్రజా సంఘాల ఆగ్రహం ఉభయ రాష్ట్రాలలో ధర్నాలు, ర్యాలీలు ప్రభుత్వం సుప్రీంకు వెళ్లాలి: రాఘవులు న్యాయంకోసం జైలుకైనా వెళ్తా: నారాయణ ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద విచారించాలి: బొజ్జా తారకం హైదరాబాద్: చుండూరు కేసులో హైకోర్టు తీర్పును నిరసిస్తూ వామపక్షాలు, వివిధ ప్రజా సంఘాలు సోమవారం ఆగ్రహాన్ని వ్యక్తంచేశాయి. ఉభయ రాష్ట్రాల లోని జిల్లా, మండల కేంద్రాలలో ధర్నాలు, ర్యాలీలు నిర్వహించాయి. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా యి. ఆయా జిల్లాల కలెక్టర్లకు ఈ మేరకు వినతి పత్రాలు అందజేశాయి. ఉమ్మడి రాష్ట్ర రాజధాని లోని రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా కార్యాలయాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుం టూరు, విశాఖ, అనంతపురం, కర్నూలుజిల్లా కేంద్ర కార్యాలయాల వద్ద వామపక్షాలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించాయి. చుండూరు దళితుల న్యాయపోరాట కమిటీ నాయకత్వంలో ఉభయ ప్రాంతాల్లో భారీ ర్యాలీలు జరిగాయి. చుండూరు కేసుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు న్యాయవ్యవస్థకే మాయని మచ్చని నినదించాయి. ఈ కేసులో అందరూ నిర్దోషులే అయితే ఎనిమిది మంది దళితుల్ని చంపింది ఎవరని ప్రశ్నించాయి. హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాను ఉద్దేశించి సీపీఎం పాలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, సీపీఐ కేంద్ర కమిటీ సభ్యుడు అజీజ్ పాషా, రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద జరిగిన సభలో సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి, పీజే చంద్రశేఖర్, సీపీఎం రాష్ట్ర నేతలు విల్సన్, వెంకట్ తదితరులు ప్రసంగించారు. విజయవాడలో జరిగిన ర్యాలీకి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, తిరుపతిలో కె.నారాయణ, గుంటూరులో ముప్పాళ్ల నాగేశ్వరరావు, జంగాల అజయ్ కుమార్, రాజమండ్రిలో మీసాల సత్యనారాయణ, విశాఖలో వి.సత్యనారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు. నిందితులందర్నీ వదిలేయడం దుర్మార్గం చుండూరు ఘటనపై రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకుని సుప్రీంకోర్టులో ప్రత్యేక బెంచ్ ద్వారా కేసు విచారణ జరిగేలా చూడాలని రాఘవులు డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టులో సామాజిక న్యాయం, విలువలు కలిగిన జడ్జిలను నియమించకపోతే అన్యాయం జరిగే అవకాశం ఉందని వారీ సందర్భంగా అభిప్రాయపడ్డారు. చుండూరు కేసుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టు ప్రత్యక్ష సాక్షుల వాదనలు విని తీర్పునిస్తే హైకోర్టు నిందితుందర్నీ వదిలివేయడం దుర్మార్గమన్నారు. ఈ తీర్పు సామాజిక న్యాయసూత్రాలకు విరుద్ధమని విమర్శిం చారు. చుండూరు దళితుల న్యాయ పోరాట కమిటీ చైర్మన్ బొజ్జా తారకం మాట్లాడుతూ... 1991 ఆగస్టు ఆరున గుంటూరు జిల్లా చుండూరులో ఎనిమిది మంది దళితులను అగ్రవర్ణాల వారు ఊచకొత కోశారని గుర్తు చేశారు. దీనిపై హైకోర్టు తీర్పు ఏమాత్రం హేతుబద్ధం కాదన్నారు. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాలను పరిగణలోకి తీసుకోకుంటే ఎలా? అని ప్రశ్నించారు. నిందితులను ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద విచారించాలని డిమాండ్ చేశారు. ఒక న్యాయస్థానం అంగీకరించిన సాక్ష్యాలను నమ్మలేమని ఉన్నత న్యాయస్థానాలే తీర్పు ఇస్తే ఇక బడుగు, బలహీనవర్గాలకు దిక్కెవరని చాడా వెంకటరెడ్డి, కె.రామకృష్ణ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ తీర్పు న్యాయవ్యవస్థకే మాయని మచ్చని కె.నారాయణ అభిప్రాయపడ్డారు. చుండూరు దళితుల కోసం చేపట్టే న్యాయపోరాటంలో జైలు కెళ్లేందుకైనా సిద్ధమని చెప్పారు. హైదరాబాద్లో జరిగిన ఆందోళనలలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క, పీఓడబ్ల్యు సంధ్య, కులవివక్ష పోరాట సమితి ప్రతినిధి సాగర్, మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బత్తుల రాంప్రసాద్, కార్యదర్శి మురళీకృష్ణ, ఎమ్మార్పీఎస్ నాయకులు బోయిని ఎల్లేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. -
చుండూరు’పై 30న ధర్నా: బొజ్జా తారకం
హైదరాబాద్, చుండూరు తీర్పును ఎండగడుతూ ఈనెల 30న ఇందిరా పార్కు వద్ద వివిధ ప్రజా సంఘాలతో కలసి ధర్నా నిర్వహిస్తామని చుండూరు దళితుల న్యాయ పోరాట కమిటీ కన్వీనర్, సీనియర్ అడ్వొకేట్ బొజ్జా తారకం బుధవారం పేర్కొన్నారు. 23 ఏళ్ల క్రితం జరిగిన చుండూరు దళితుల ఊచకోత కేసును తమ అవసరాల కోసం కేవలం ఏడు రోజుల్లో విచారణ ముగించారని ఆయన మండిపడ్డారు. జిల్లా స్పెషల్ కోర్టు విధించిన శిక్షలను రద్దు చే స్తూ 8 మంది దళితులను హత్య చేసిన ఒక సామాజిక వర్గానికి చెందిన హంతకులందరూ నిర్దోషులే అంటూ తీర్పు చెప్పడం అనుమానాలకు దారితీస్తుందన్నారు. ఈ తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని ఆయన పేర్కొన్నారు. -
ప్రొఫెసర్ సాయిబాబాను బేషరతుగా విడుదల చేయాలి
హైదరాబాద్: ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న జి.నాగాసాయిబాబాను బేషరతుగా విడుదల చేయాలని పౌర, ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. శనివారం హైదర్గూడ ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివిధ సంఘాల నాయకులు బొజ్జాతారకం, రవిచంద్ర, దుడ్డు ప్రభాకర్, ప్రొఫెసర్.లక్ష్మణ్, బల్లా రవీంద్రనాథ్, చిక్కుడు ప్రభాకర్ మాట్లాడుతూ వికలాంగుడైన సాయిబాబాను పోలీసులు చ ట్ట విరుద్ధంగా అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌర హక్కులకు భంగం కలిగించేలా పోలీసులు వ్యవహరించారన్నారు. సాయిబాబా కుటుంబసభ్యులను భయభ్రాంతులకు గురిచేసి మావోలు, టైస్ట్లతో సంబంధాలున్నాయని ప్రచారం చేస్తూ అరెస్ట్ చేయడం సరికాదన్నారు. సాయిబాబా ఆపరేషన్ గ్రీన్హంట్కు వ్యతిరేకంగా అంతర్జాతీయంగా మద్దతు కూడగడుతున్నారనే సాకుతో అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. సాయిబాబా రెవల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఆర్డీఎఫ్) సంయుక్త కార్యదర్శిగా ఉండి ఎన్నో ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారని, అందుకే ప్రభుత్వం కుట్రపన్ని పోలీసులతో కిడ్నాప్ చేయించిందన్నారు. సాయిబాబాను విడుదల చేసే వరకు ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. సాయిబాబా తల్లి సూర్యవతి మాట్లాడుతూ వికలాంగుడైన తన కూమారుడిని పోలీసులు కిడ్నాప్ చేశారని, వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. చిన్నకేసు అయితేనే పరిధి దాటిరాని పోలీసులు గడ్చిరౌలి నుండి ఢిల్లీకి వెళ్లి ఎత్తుకెళ్లడంలో కుట్ర దాగుందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కోటి, రివేరా తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాసంఘాలకూ ముసాయిదా బిల్లు ఇవ్వాలి
అప్పుడే విస్తృత చర్చకు అవకాశం: అశోక్బాబు విభజన బిల్లు ప్రతులను ప్రజా సంఘాలకు కూడా ఇవ్వాలని ఏపీఎన్జీవోల నేత అశోక్బాబు డిమాం డ్ చేశారు. తద్వారా విస్తృత చర్చకు అవకాశం ఉంటుం దన్నారు. ఇక్కడ సంఘం కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సమావేశాల్లో బిల్లు చర్చకు వస్తుందా? లేదా? అన్నది కూడా సందిగ్ధమేనన్నారు. అసెంబ్లీలో బిల్లు పెట్టిన వెంటనే ఆందోళన చేపడతామన్నారు. రాజకీయ ఉద్దేశంతోనే హైదరాబాద్ వచ్చిన డిగ్గీ రాజాను ‘గో బ్యాక్’ అంటూ తాము చేసిన ఆందోళనకు కాంగ్రెస్ నేతలు హర్షం ప్రకటించారని తెలిపారు. ‘‘డిగ్గీ రాజా రావడం దుశ్శకునంగా భావిస్తున్నాం. బిల్లును వ్యతిరేకించాల్సిందిగా సభ్యులను కోరుతున్నాం. శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్లో బిల్లు పెడదామనుకున్న ఢిల్లీ నేతల్లో కూడా ఆశలు పోయాయి’’ అని అశోక్బాబు వ్యాఖ్యానించారు. ఉద్యోగుల డిమాండ్లను అంగీకరించకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. సంఘం ఎన్నికలపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. ఈ సారి సమ్మె చేస్తే చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. బిల్లుపై అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళతామన్నారు.