'రేపు సాయంత్రం వరకు ఉంటా కేసీఆర్.. చర్చకు రా' | dk Aruna takes on cm kcr | Sakshi
Sakshi News home page

'రేపు సాయంత్రం వరకు ఉంటా కేసీఆర్.. చర్చకు రా'

Published Sat, Sep 3 2016 2:21 PM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM

'రేపు సాయంత్రం వరకు ఉంటా కేసీఆర్.. చర్చకు రా'

'రేపు సాయంత్రం వరకు ఉంటా కేసీఆర్.. చర్చకు రా'

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్కు కాంగ్రెస్ పార్టీ నేత డీకే అరుణ సవాల్ విసిరారు. తాను రేపు సాయంత్రం వరకు దీక్షలోనే ఉంటానని, జిల్లాల విభజనపై బహిరంగ చర్చకు రావాలని సవాల్లో డిమాండ్ చేశారు. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ అశాస్త్రీయంగా ఉందని పేర్కొంటూ శనివారం ఇందిరాపార్క్ వద్ద రెండు రోజులు నిరాహార దీక్షను పొన్నాల లక్ష్మయ్య, డీకే అరుణ దీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాల విభజన అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎవరైనా సరే చర్చకు రావొచ్చని అన్నారు. జిల్లాల విభజన శాస్త్రీయంగా జరుగుతుందని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ఏయే ప్రాతిపదికన జిల్లాల విభజన చేస్తున్నారో చెప్పాలన్నారు. అఖిలపక్ష భేటీలో ముసాయిదాను ఏ పార్టీలు ఆమోదించలేదని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement