చుట్టూ పచ్చని మైదానం.. మనసును ఆహ్లాదపరిచే చల్లగాలులు.. వీటి తో పాటు వీనులకు విందు చేసే సంగీ తం.. ఆకట్టుకునే నృత్యాలు.. వారంపాటు పనిభారంతో అలసినవారు వారాంతంలో ఈ ఆహ్లాదం చాలనుకుం టారు.
ఐదింటిని ఎంపికచేసిన జీహెచ్‌ఎంసీ
ఎంపిక చేసిన పార్కులివే..
ఇందిరా పార్కు
జలగం వెంగళరావు పార్కు
కృష్ణకాంత్ పార్కు
చాచానెహ్రూ పార్కు
కేఎల్‌ఎన్‌వై పార్కు
సాక్షి, సిటీబ్యూరో:
చుట్టూ పచ్చని మైదానం.. మనసును ఆహ్లాదపరిచే చల్లగాలులు.. వీటి తో పాటు వీనులకు విందు చేసే సంగీ తం.. ఆకట్టుకునే నృత్యాలు.. వారంపాటు పనిభారంతో అలసినవారు వారాంతంలో ఈ ఆహ్లాదం చాలనుకుం టారు. ఉద్యానవనాలకు వెళ్లేవారిని ఆహ్లాదకర వాతావరణంతో రంజింప చేయాలని జీహెచ్‌ఎంసీ తలపోస్తోంది. అందుకుగాను ఎంపిక చేసిన పార్కుల్లో సాం స్కృతిక కార్యక్రమాల నిర్వహణకు వీలు గా అవసరమైన విద్యుత్ సరఫరాతోపాటు ఆడియో సిస్టం.. ప్రదర్శనలకు వీలుగా వేదికలు నిర్మించి సదరు పార్కులను ‘కల్చరల్ పార్కులు’గా తీర్చిదిద్దాలని భావిస్తోంది. ఈ ఏర్పాట్లు పూర్తయ్యాక, సంబంధిత విభాగాలతో సమన్వయం కుదుర్చుకొని ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఇం దిరాపార్కులో ప్రదర్శనలకు యాంపీథి యేటర్‌ను అందుబాటులోకి తేనున్నారు.
ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ సెంట్రల్‌జోన్ పరిధిలోని పేరెన్నికగన్న పార్కుల్లో ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవి ఏర్పాటయ్యాక, వీటికి వచ్చే స్పందనను బట్టి ఇతర ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేయనున్నారు. పేరెన్నికగన్న వారి ప్రదర్శనలే కాక.. ఆసక్తితో ప్రదర్శనలిచ్చేవారికి కూడా ఈ వేదికల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. కొత్త కళాకారుల అరంగేట్రానికి సైతం వీటిని వేదికలుగా మలచనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ చెప్పారు. శని, ఆదివారాల్లో ఈ ప్రదర్శనలు నిర్వహించాలనే యోచనలో ఉన్నారు. వివిధ రంగాల్లో ఎనలేని సేవచేసిన నగరానికి చెందిన వారిని సముచితంగా సత్కరించాలనే యోచన ఉన్నట్లు కమిషనర్ తెలిపారు. వారి కృషికి తగిన గుర్తింపునివ్వడం ద్వారా కొత్తవారికి కూడా ప్రేరణగా ఉంటుందన్నారు.
6
ఏసీబీ వలలో నగర పంచాయతీ కమిషనర్
ఎన్‌ఓసీ జారీకి రూ.2 లక్షలు డిమాండ్
రూ.50 వేలకు ఒప్పందం
మధ్యవర్తి ద్వారా డబ్బు తీసుకుంటుండగా
పట్టుకున్న అధికారులు
మన్సూరాబాద్,న్యూస్‌లైన్: డిప్యూటేషన్‌పై పెద్దఅంబర్‌పేట నగర పంచాయతీ కమిషనర్‌గా పనిచేస్తున్న ఉపేందర్‌రెడ్డి ఏసీబీ వలలో చిక్కారు. జీహెచ్‌ఎంసీ ఈస్ట్‌జోన్ జాయింట్ కమిషనర్ ఉపేందర్‌రెడ్డి డిప్యూటేషన్‌పై పెద్దఅంబర్‌పేట నగర పంచాయతీ కమిషనర్‌గా వచ్చారు. ఎల్‌బీనగర్‌కు చెందిన సుంకోజు శ్రీనివాస్ పెద్దఅంబర్‌పేటలో సుష్మిత కన్‌స్ట్రక్షన్స్ పేరుతో లైట్‌వెయిట్ బ్రిక్స్ కంపెనీ ఏర్పాటు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నాడు. తనిఖీ నిర్వహించిన ఇంచార్జి శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ రాములు..కమిషనర్‌ను కలవాలని ఫోన్‌నెంబర్ ఇచ్చారు. శ్రీనివాస్ కమిషనర్ ఉపేందర్‌రెడ్డిని కలవగా ఎన్‌వోసీ సర్టిఫికెట్ జారీకి రూ.4.50 లక్షలు డిమాండ్ చేయగా...రూ.2 లక్షలకు ఒప్పందం కుదిరింది. మొదట రూ.50వేలు చెల్లించి ఎన్‌వోసీ ఇచ్చాక మిగతా మొత్తమివ్వాలని మాట్లాడుకున్నారు.
కామినేని బిగ్‌బజార్ వద్ద శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ రాములు వచ్చి కలుస్తాడని, అతనికి డబ్బులివ్వాలని కమిషనర్..శ్రీనివాస్‌కు సూచించారు. చేసేదిలేక మంగళవారం ఉదయం శ్రీనివాస్ ఏసీబీ డీఎస్పీ శంకర్‌రెడ్డికి దీనిపై ఫిర్యాదు చేశాడు. దీంతో ముందుగానే బిగ్‌బజార్ వద్ద మాటువేసిన ఏసీబీ అధికారులు శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ రాములుకు ఫిర్యాదుదారు శ్రీనివాస్ రూ.50వేలు ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అధికారుల సూచన మేరకు..రాములు కమిషనర్ ఉపేందర్‌రెడ్డికి ఫోన్‌చేసి శ్రీనివాస్ నుంచి రూ.50 వేలు ముట్టాయని తెలుపగా..నీ వద్దే ఉంచుకోవాలని, రేపు తీసుకుంటానని కమిషనర్ బదులిచ్చారు. ఈ సంభాషణలను ఏసీబీ అధికారులు రికార్డు చేశారు. అనంతరం కమిషనర్ ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఎవరైనా అధికారులు అవినీతికి పాల్పడితే అవినీతి నిరోధకశాఖకు 9440446134 నెంబర్‌కు సమాచారమివ్వాలని డీఎస్పీ శంకర్‌రెడ్డి కోరారు.