
మార్పుపై పునరాలోచించాలి: చాడ
సాక్షి, హైదరాబాద్: ఇందిరాపార్కు వద్ద ఉన్న ధర్నాచౌక్‌ను మరో చోటికి మార్చే విషయంపై పునరాలోచించాలని కోరుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి లేఖ రాశారు. ధర్నాచౌక్‌ను అక్కడే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ధర్నాచౌక్‌ను నగర శివార్లలోని ప్రాంతాలకు తరలిస్తే ధర్నాలు, నిరసనల ద్వారా ఆయా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే అవకాశం లేకుండా పోతుందన్నారు.
రాష్ట్రం ఏర్పడి మూడేళ్లు కావస్తున్నా, సీఎంను ప్రత్యక్షంగా కలసి వినతులు సమర్పించే అవకాశం లేకుండా పోయిందన్నారు. ఈ వాస్తవ విషయాలను గుర్తించాలని సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్య సంప్రదాయాలను గుర్తించక ఏకపక్ష ధోరణితో వ్యవహరించడం మంచి పద్ధతి కాదన్నారు.