నెల 4న మహాధర్నా నిర్వహించనున్నట్లు యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నర్సిరెడ్డి, రవి ఒక ప్రకటనలో తెలిపారు.
సాక్షి, హైదరాబాద్: కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లోని (కేజీబీవీ) ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 4న మహాధర్నా నిర్వహించనున్నట్లు యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నర్సిరెడ్డి, రవి ఒక ప్రకటనలో తెలిపారు.
ఇందిరాపార్కు వద్ద ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ధర్నా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పదో పీఆర్‌సీ ప్రకారం వేతనాలు, వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, హెల్త్‌కార్డులు, వేసవి సెలవులు తదితర డిమాండ్ల సాధనకు ధర్నా చేస్తున్నట్లు వివరించారు.