
ధర్నాచౌక్‌ను అక్కడే కొనసాగించాలి
సాక్షి, హైదరాబాద్: ఇందిరాపార్కువద్ద ఉన్న ధర్నాచౌక్‌ను అక్కడే కొనసాగించాలని మండలిలో విపక్షనేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. ధర్నాచౌక్ తరలింపు యోచనను ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. ముస్లింలు, ఎస్టీల రిజర్వేషన్లు పెంచాలంటూ ఢిల్లీలో పార్లమెంట్ సమీపంలోని జంతర్‌మంతర్ వద్ద ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ధర్నా చేద్దామంటూ చెప్పిన సీఎం.. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ధర్నాచౌక్‌ను నగర శివార్లలోకి తరలిస్తామంటే ఎలా అని శుక్రవారం శాసనమండలిలో ప్రశ్నించారు.
రిజర్వేషన్ల వల్ల నష్టం జరుగుతోందంటూ పోలీస్‌శాఖలో ఏసీపీ స్థాయి అధికారి వాట్సాప్ గ్రూప్‌లో సందేశం పెట్టడం తీవ్రమైన అంశమని, దీనిపై చర్య తీసుకోవాలని ఎమ్మెస్ ప్రభాకర్ కోరారు. ఇటువంటివి అత్యంత అభ్యంతరకరమని, ఈ వ్యాఖ్యలను చేసినట్లు తేలితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కడియం చెప్పారు.