‘మున్సిపల్ కార్మికుల న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించమంటే పట్టించుకోవు. సమ్మె చేస్తామని నోటీసు ఇచ్చేందుకు వస్తే అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వవు.
కవాడిగూడ,న్యూస్‌లైన్:
‘మున్సిపల్ కార్మికుల న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించమంటే పట్టించుకోవు. సమ్మె చేస్తామని నోటీసు ఇచ్చేందుకు వస్తే అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వవు. కార్మికులంటే అంత అలుసా..? వైఖరి మార్చుకోకుంటే చెత్తలో పారేస్తామని’ మున్సిపల్ కార్మిక సంఘాల నేతలు జీహెచ్‌ఎంసీ కమిషనర్ కృష్ణబాబును ెహ చ్చరించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ ఉద్యోగ,కార్మిక ఐక్యసంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెలో భాగంగా మంగళవారం ఇందిరాపార్కు వద్ద భారీ బహిరంగసభ జరి గింది. అంతకుముందు కార్మికులు సుందరయ్యపార్కు నుంచి ఇందిరాపార్కు వరకు ర్యాలీ నిర్వహించారు.
ఇందిరాపార్కు వద్ద జరిగిన సభలో ఏఐటీయూసీ, బీఎంఎస్, సీఐటీయూ, హెచ్‌ఎంఎస్, ఏఐయూటీయూసీ ,టీఎన్టీయూసీ, టీఆర్‌ఎస్ కేవీ తదితర కార్మిక సంఘాల నేతలు పాలడుగు భాస్కర్, కృష్ణారావు, రాధాకృష్ణ తదితరులు ఉద్వేగంగా మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేసేందుకు నోటీసు ఇస్తానికి వెళ్లితే కమిషనర్ కృష్ణబాబు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదన్నారు. కార్మిక సంఘాల నేతలతో సానుకూలంగా చర్చల్లో పాల్గొంటూ రాత్రి సమయాల్లో ఫోన్లలో బెదిరిస్తున్నారని ఆరోపించారు. కాంట్రాక్టు కార్మికులకు న్యాయబద్ధంగా కనీస వేతనం రూ.12,500 ఇవ్వాలని, కరువుభత్యం చెల్లించాలని, పర్మినెంట్ ఉద్యోగులకు హెల్త్‌కార్డులు, జీపీఎఫ్ అకౌంట్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికుల వేతనాల్లో కట్ చేస్తున్న పీఎఫ్,ఈఎస్‌ఐ సొమ్మును వారి ఖాతా ల్లో జమకావడం లేదని, ఇందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూసుఫ్ (ఏఐటీయూసీ), శంకర్ (బీఎంఎస్), వెంకటేష్(సీఐటీయూ), రెబ్బ రామారావు,వెంకటేష్ (హెచ్‌ఎంఎస్), శ్రీనివాస్ (టీఎన్‌టీయూసీ), భరత్ (ఏఐయూటీయూసీ), సాయిరెడ్డి, భాస్కర్‌రావు(టీఆర్‌ఎస్‌కేవీ) తదితరులు పాల్గొన్నారు.