
నగరంలో కదం తొక్కిన హిజ్రాలు
హైదరాబాద్: ఇందిరా పార్కు వద్ద హిజ్రాలు తమ హక్కుల కోసం ఆదివారం ధర్నా చేపట్టారు. ఉద్యోగం కావాలి.. ఉపాధి కావాలి.. రక్షణ కావాలి.. అంటూ తెలంగాణ హిజ్రా ట్రాన్స్‌జెండర్ సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. హిజ్రాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్‌లు కల్పించాలి, ట్రాన్స్‌జెండర్‌లపై జరుగుతున్న ఆకృత్యాలను అరికట్టాలని ప్లకార్డులు చేతబట్టుకుని నినాదాలు చేశారు.