
మూగబోయిన ‘ధర్నాచౌక్’
ఇందిరాపార్కు వద్ద నిరసనలకు అనుమతులివ్వని పోలీసులు
⇒ రాజధాని చుట్టూ నాలుగు ప్రాంతాల గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో నిరసనలకు కేరాఫ్‌గా ఉన్న ధర్నాచౌక్ మూగబోయింది. ఇక్కడ ధర్నాలు నిర్వహించుకోవడానికి పోలీ సులు అనుమతులు నిలిపివేశారు. నగరానికి నాలుగు వైపులా... కాప్రాలోని జవహర్‌నగర్, ఘట్‌కేసర్ సమీపంలోని ప్రతాప్ సింగారం, దుండిగల్ వద్ద గండిమైసమ్మ, శంషాబాద్‌ల్లో ‘ధర్నాచౌక్స్’ఏర్పాటు చేశారు. ఆందోళనకా రులను అక్కడికే పంపిస్తున్నారు. అనుమతు లు కూడా ఆయా ప్రాంతాల అధికారుల నుంచే తీసుకోవాల్సిందిగా స్పష్టం చేస్తున్నారు.
ప్రత్యేక ఉత్తర్వులు లేకుండానే...
ఇందిరాపార్క్ సమీపంలో నిరసనలు చేసు కోవడానికి ప్రత్యేకంగా ధర్నాచౌక్‌కు కేటాయి స్తున్నట్లు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వమూ జీవో కానీ, ఆదేశాలు కానీ ఇవ్వలేదు. రాజధాని కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే నిరసనకారులకు సచివాలయం వద్దే నిరసలు తెలిపేవారు. అయితే దీనికి ఓ వేదిక కావాలనే ఉద్దేశంతో 1996–97ల్లో ఇందిరాపార్క్ పక్కనున్న 40–50 ఎకరాల గ్రౌండ్‌ను ఎంపిక చేశారు. ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేకుండానే ఇది ధర్నా చౌక్‌గా మారిపోయింది.
ఇందిరాపార్క్ ఎదురుగా ఎన్టీఆర్ స్టేడియం నిర్మించిన తర్వాత వివాదం రేగింది. కొందరు ఆ ప్రాంతంలో నిరసనల నిర్వహణపై న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. దీంతో కోర్టు అక్కడ రాజకీయ పార్టీల సభలకు అనుమతి ఇవ్వద్దం టూ ఆదేశించింది. ఈ పరిణామం తర్వాత ఇందిరాపార్క్–ఎన్టీఆర్ స్టేడియం మధ్య ప్రాంతాన్ని 2002లో ధర్నా చౌక్‌గా ఎంపిక చేసిన పోలీసులు అక్కడే నిరసనలకు అనుమతులు ఇస్తూ వచ్చారు.
మారిన పరిస్థితుల నేపథ్యంలో...
గత పదిహేనేళ్లలో ధర్నాచౌక్ చుట్టపక్కల జనా వాసాలు, ట్రాఫిక్ గణనీయంగా పెరిగిపోయా యి. అనేక కార్యాలయాలు, ఆస్పత్రులు వెలి శాయి. దీంతో ఇక్కడ ఆందోళనప్పుడు స్థాని కులకు ఇబ్బందులు తప్పట్లేదు. సమీపంలోని ఎల్‌ఐసీ కాలనీ వాసులు దీనిపై హైకోర్టును ఆశ్రయించారు. కొన్నిసార్లు పోలీసులు రోడ్లు మూసేస్తుండటంతో రాకపోకలూ సాధ్యం కావట్లేదని మెరపెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ కేసు పెండింగ్‌లో ఉంది. వీటన్నింటినీ బేరీజు వేసిన ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రాంతాన్ని ఎంపిక చేయాల్సిందిగా పోలీసు విభాగాన్ని ఆదేశించింది.
అందరికీ అందుబాటులో ఉండేలా...
నగర శివార్లలో ధర్నాచౌక్ కోసం ఒకే ప్రాం తంలో 30–40 ఎకరాల స్థలం ఎంపిక చేయా లని పోలీసు విభాగం తొలుత భావించింది. అయితే ఏదో ఓ పక్కన ఉంటే మిగిలిన వైపు జిల్లాల నుంచి వచ్చే వారికి ఇబ్బందని కొందరు అధికారులు వాదించారు. దీంతో నగరానికి నాలుగు వైపులా 20 నుంచి 25 కిమీ దూరంలో ఉన్న జవహర్‌నగర్, ప్రతాప్ సింగారం, గండిమైసమ్మ, శంషాబాద్‌లో అనువైన ప్రాంతాలను గుర్తించారు. ఒక్కో ప్రాంతం విస్తీర్ణం గరిష్టంగా ఐదెకరాలు ఉండేలా చర్యలు తీసుకున్నారు.
ప్రశ్నించే గొంతును మూయడం అసాధ్యం...
చీమల దండుని నిలిపివేసేందుకు ఎన్నిరకాలుగా ప్రయత్నించినా అన్ని అడ్డుగోడలను దాటుకొని చీమలు చేరాల్సిన చోటుకి చేరుకుంటాయి. ఇది సహజ సూత్రం. అలాగే ధర్నా చౌక్ తరలించి, ప్రశ్నించే గొంతులను మూయడం అసాధ్యమైన విషయం అని ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి. ధర్నా చౌక్‌ని మార్చడం భావప్రకటనా స్వేచ్ఛకు విరుద్ధం.
– కోదండరాం, తెలంగాణ జేఏసీ చైర్మన్
ప్రాథమిక హక్కులకు భంగం
ప్రజల్లో ఉన్న నిరసన కారణాలను తెలుసు కొని వాటిని పరిష్కరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి అవసరం. ప్రజల అసంతృప్తిని అణచివేయాలని చూడడం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కలకు వ్యతిరేకం. నిరంకుశం.
– జీవన్‌కుమార్, మానవ హక్కుల సంఘం
హింస వైపు ఉసిగొల్పడమే...
రాజధానిలో కాకుండా పక్క జిల్లాలకు ధర్నా చౌక్‌ని మార్చడమంటే ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను కనీసం వినడానికి కూడా సిద్ధంగా లేనట్టు. నిరసనను తెలిపే హక్కుకూడా లేకుండా చేసి, హింసవైపు వుసిగొల్పడమే.
– నారాయణరావు, పౌరహక్కుల సంఘం
నిరసన హక్కును హరించడమే...
ఇది ప్రజాస్వామికంగా నిరసన తెలిపే హక్కుని హరించడమే. ఉద్యమాల కారణంగానే తెలంగాణ వచ్చింది. నాడు చంద్రబాబు జన సంచారంలేని ఇందిరాపార్కుకి ధర్నాచౌక్‌ను మార్చారు. కేసీఆర్ ప్రభుత్వం మరింత అసహనాన్ని ప్రదర్శించడం దుర్మార్గం.
– సంధ్య, ప్రగతిశీల మహిళా సంఘం