⇒ లెఫ్ట్, ప్రజాసంఘాల నిర్ణయం
⇒ నేడు ప్రజాసంఘాల నేతలతో సదస్సు
సాక్షి, హైదరాబాద్: ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ నిరసనలకు అవకాశం కల్పించే వరకు వివిధ రూపాల్లో దీర్ఘకాలిక ఉద్యమానికి సిద్ధం కావాలని వామపక్షాలు, ప్రజాసంఘాలు నిర్ణయించాయి. ఈ దిశలో ఉమ్మడి కార్యాచరణను సిద్ధం చేసుకున్నాయి. ఇప్పటికే ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీగా ఏర్పడినా, రాబోయే రోజు ల్లో దానిని విస్తృతపరిచి కలిసొచ్చే శక్తులను భాగ స్వాములను చేయాలనే ఆలోచనతో ఉన్నాయి. ముం దుగా జిల్లాస్థాయిల్లో ధర్నాచౌక్ పరిరక్షణపై ప్రచార కార్య క్రమాలు నిర్వహించి, అన్ని జిల్లాలు, మండల స్థాయిల నుంచి ఈ ఉద్యమంలో వివిధ వర్గాలు పాల్గొనేలా చేయా లని వామపక్షాలు, ప్రజాసంఘాలు భావిస్తున్నాయి.
దీనికి అనుగుణంగా అన్ని జిల్లాల్లో రౌండ్‌టేబుల్ సమావే శాలను నిర్వహించాలని నిర్ణయించాయి. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రజాసంఘాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఇతర బాధ్యులతో కూడిన రాష్ట్ర సదస్సును నిర్వహించనున్నారు. ఉమ్మడి కార్యాచరణ చేపట్టే దిశలో ఈ నెల 14 వరకు జిల్లాల్లో వివిధ రూపాల్లో కార్యక్రమాలను చేపట్టను న్నారు. 15 నుంచి వచ్చేనెల 9 వరకు మగ్దూంభవన్‌లో రిలే నిరాహారదీక్షల ద్వారా మద్దతును కూడగట్టాలని, మే 10న హైదరాబాద్ ఆక్రమ ణను చేపట్టాలని నిర్ణయించారు.
ఇతర పార్టీల భాగస్వామ్యంపై భిన్నాభిప్రాయాలు...
ఇదిలా ఉండగా ధర్నాచౌక్ పునరుద్ధరణ విషయంలో కాం గ్రెస్, బీజేపీ, టీడీపీలను కూడా కలుపుకుని పోవాలని గురువారం రాత్రి జరిగిన భేటీలో కొందరు సూచించినా దానిపై ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. ఈ సమస్యపై వామపక్షాలు, ప్రజాసంఘాలు పోరాడుతున్న విధంగానే ఇతర పార్టీలు కూడా కృషి చేస్తేనే విస్తృత ప్రాతిపదికపై కలవొచ్చునని సీపీఐ, సీపీఎం నాయకులు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.