బీజేపీ ఎమ్మెల్యేల హెచ్చరిక
హైదరాబాద్: ఇందిరాపార్కు వద్దనున్న «ధర్నాచౌక్‌ను నగర శివార్లకు తరలిస్తే సహిం చమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కె.లక్ష్మణ్ మండిపడ్డారు. ఇందిరాపార్కు వద్ద ధర్నాల నిషేధానికి నిరసనగా గురు వారం బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పాద యాత్ర నిర్వహించారు. బీజేపీ శాసన సభాపక్షనేత జి.కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ రామచందర్ రావు ఇందిరాపార్కు నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర చేశారు. అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమానికి బీజం వేసిన ఇందిరాపార్కు ధర్నాచౌక్‌ను తరలిస్తామంటే ఊరుకోబోమని, ఉద్యమా నికి ఊపిరిగా నిలిచిన పార్టీలను, ప్రజా సంస్థలను ఏకం చేసి పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పద్ధతిలో పోరా టాలు చేస్తామన్నారు. ఎమ్మెల్యేలతో కలసి ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద ధర్నాలు చేస్తా మని చెబుతున్న కేసిఆర్.. ఇందిరాపార్కు వద్ద ధర్నాచౌక్‌ను ఎత్తివేయడం విడ్డూరంగా ఉందన్నారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. పత్రికా స్వేచ్చను, ప్రజాస్వామ్యాన్ని హరించిన ఫలితంగా 1977 ఎన్నికలల్లో ఇందిరాగాంధీకి ప్రజలు ఎలాంటి గుణ పాఠం చేప్పారో గుర్తుచేశారు. ధర్నాచౌక్‌పై నిషేధాన్ని వెంటనే ఉపసంహ రించుకో వాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజాగ్రహనికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.
తరలిస్తే సహించం
Published Fri, Mar 17 2017 3:13 AM | Last Updated on Tue, Aug 21 2018 11:41 AM