Laxaman
-
తెలంగాణకు మరో స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో బుధవారం తెలంగాణ కుర్రాడు లక్ష్మణ్ జూడోలో (50 కేజీలు ) పసిడి పతకం గెలిచాడు. స్విమ్మింగ్‌లో బాలుర 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లేలో సాయి నిహార్ కాంస్యం... బాలికల 400 మీటర్ల ఫ్రీస్టయిల్లో వ్రితి అగర్వాల్ రజతం నెగ్గారు. రోయింగ్‌లో బాలుర క్వాడ్రాపుల్ స్కల్స్ రేసులో తెలంగాణ జట్టుకు కాంస్యం దక్కింది. చదవండి: IND vs AUS: తొలి బంతికే సిరాజ్ వికెట్.. రోహిత్, ద్రవిడ్ రియాక్షన్ మామూలుగా లేదుగా! వీడియో వైరల్ -
టీఆర్ఎస్కు ఓటేస్తే ఎంఐఎంకు వేసినట్టే: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్‌ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటేస్తే ఎంఐఎంకు వేసినట్టేనని, కాంగ్రెస్‌కు వేస్తే టీఆర్ఎస్కు వేసినట్లే అవుతుందని, ఈ మూడు పార్టీలు ఒక్కటేనని బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ఎంఐఎం కనుసన్నల్లోనే టీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తోందని, అసద్ పార్టీ కోసమే ఇద్దరు పిల్లల నిబంధనను ప్రభుత్వం తొలగించిందని ఆరోపించారు. బీజేపీలో చేరి తొలిసారిగా శనివారం పార్టీ కార్యాలయానికి వచ్చిన సీనియర్ రాజకీయవేత్త మోత్కుపల్లి నర్సింహులుకు పార్టీనాయకులు, కార్యకర్తలు సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. మతవిద్వేషాలు ఎంఐఎం రెచ్చగొట్టుతోందని, అసదుద్దీన్ ఒవైసీ చదువుకున్న అజ్ఞాని అని అమాయకులను రెచ్చగొట్టి తప్పు దారి పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. కుటుంబ అవినీతి పాలన పోవాలంటే బీజేపీ కి ఓటు వేయాలి...కాంగ్రెస్ కి ఓటు వేస్తే మోరిలో వేసినట్టేనని అన్నారు. మోత్కుపల్లి చేరిక పార్టీ బలోపేతానికి దోహదం చేస్తోందన్నారు. మరోవైపు లక్ష్మణ్ సమక్షంలోనే బీజేపీలో అంతర్గత గొడవలు బయటపడ్డాయి. ఎంపీ ధర్మపురి అరవింద్ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ టికెట్ అమ్ముకున్నారని మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ అనుయా యులు పార్టీ కార్యాలయంలోనే నిరసన తెలిపారు. తెలంగాణ పరువు ప్రతిష్టలు సీఎంకేసీఆర్ మంటగలిపారని, ఎన్నికల కోసమే పథకాలు పెడుతున్నారని మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ను తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందని, తాను ప్రతీ ఊరు, ఇళ్లు తిరిగి కేసీఆర్ బండారం బయటపెడతానని ఆయన పతనమే తన పంతమని నర్సింహులు వ్యాఖ్యానించారు. మరోవైపు జనగామ మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ప్రేమలత రెడ్డి బీజేపీలో చేరారు. -
‘తెలంగాణ’ వచ్చాక అతిపెద్ద కుంభకోణం
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షాఫలితాల్లో చోటుచేసుకున్న గందరగోళం సాధారణ విషయం కాదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన అతిపెద్ద కుంభకోణాల్లో ఇది ఒకటని బీజేపీ ఆరోపించింది. దాదాపు 10 లక్షల మంది విద్యార్థుల కుటుంబాలతో చెలగాటం ఆడటాన్ని ప్రభుత్వం సాధారణ విషయంగా తీసుకుందని మండిపడింది. ఇప్పటి వరకు 16 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే హైకోర్టు సిట్టింగ్ జడ్జి తో న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. వివిధ అంశాలపై గంటల తరబడి సమీక్షలు చేసే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ వ్యవహారంపై ఒక్కమాట కూడా మాట్లాడకపోవటం విడ్డూరంగా ఉందని పేర్కొంది. మంగళవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని కలసి వినతిపత్రం అందజేసింది. అనంతరం లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడారు. పది లక్షలమంది విద్యార్థులను తీవ్ర మనోవేదనకు, కొంతమంది ఆత్మహత్యలకు దారితీసిన ఈ ఉదంతాన్ని ప్రభుత్వం తేలికగా తీసుకోవటం భావ్యం కాదన్న విషయాన్ని సీఎస్ దృష్టికి తెచ్చినట్టు చెప్పారు. మంత్రి జగదీశ్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు దైర్యంగా ఉండాలని, ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని లక్ష్మణ్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాన్ని దారిలోకి తెచ్చేందుకు అన్ని కలెక్టరేట్ల ఎదుట బుధవారం దిష్టిబొమ్మలు దహనం చేయనున్నట్టు తెలిపారు. -
పార్టీ కోరితే పోటీకి సిద్ధం: కృష్ణం రాజు
సాక్షి, న్యూఢిల్లీ: పార్టీ నాయకత్వం ఆదేశిస్తే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని కేంద్ర మాజీమంత్రి, నటుడు కృష్ణం రాజు తెలిపారు. తిరిగి మోదీయే ప్రధాని కావాలని మనస్ఫూరిగా కోరుకుంటున్నాననీ, ప్రజల్లో మోదీ పట్ల అనూహ్య మద్దతు పెరుగుతోందని అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో పాల్గొన్న కృష్ణం రాజు అనంతరం మీడియాతో మాట్లాడారు. సేవకుడంటే మోదీలా ఉండాలని, ఆయన ప్రసంగం వింటే మరోసారి గెలిచినంత సంతోషంగా ఉందన్నారు. అగ్రవర్ణలకు 10 శాతం రిజర్వేషన్లపై అన్ని వర్గాల నుంచి అభినందనలు వస్తున్నాయని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్రం నిధులు విడుదల చేస్తున్నా.. కొందరు మాత్రం నిధులు రావట్లేదంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. మేరా బూత్ మాజ్బూత్ నినాదంతో.. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాలతో కార్యకర్తలకు మార్గదర్శకం చేశారని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కే లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. లోక్‌సభ ఎన్నికల కోసం కూటమి కడుతున్న పార్టీలకు నాయకుడెవరనీ, మోదీకి సరితూగే నేత కూటమిలో ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు. ఎజెండా, నాయకత్వం లేని కూటమని విమర్శించారు. దేశంలో అవినీతిలేని పాలనను మోదీ అందిస్తున్నారనీ, మేరా బూత్ మాజ్బూత్ నినాదంతో ప్రతీ కార్యకర్త పార్టీని గెలిపించిందేకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. 2014 ఫలితాలే పునారావృత్తం.. రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం పార్టీ శ్రేణులను సంసిద్ధం చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశామని బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి బాల సుబ్రహ్మణ్యం తెలిపారు. గతంలో కంటే రెట్టింపు ఉత్సహంతో పార్టీ శ్రేణులు ఉన్నారని, 2014 ఫలితాలే మరలా పునారావృత్తం అవుతాయని ఆయన ధీమా వ్యక్తంచేశారు. ఎన్నికల వ్యూహాలు, ప్రణాళికల గురించి సమావేశంలో చర్చించినట్లు ఆయన వెల్లడించారు. దేశం అభివృద్ధిలో వేగంగా సాగాలంటే బీజేపీతో మాత్రమే సాధ్యమని వ్యాఖ్యానించారు. -
కమలనాథుల కదనోత్సాహం..!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ‘ముందస్తు’ ఎన్నికల సమరం కోసం కమలనాథులు సన్నద్ధం అవుతున్నారు. అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికల నిర్ణయం తర్వాత ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు బీజేపీ దూకుడు పెంచింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 నియోజకవర్గాల నుంచి అభ్యర్థులను బరిలోకి దింపేందుకు ఆ పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తోంది. తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్‌షా కనీసం 50 సభల ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. ఈనెల 12 లేదా 15న మహబూబ్‌నగర్ నుంచి ఈ ప్రచారపర్వానికి శ్రీకారం చుట్టనున్నట్లు కూడా ప్రకటించారు. భారీ బహిరంగ సభల ద్వారా పార్టీలో జోష్ పెంచేందుకు బీజేపీ అధిష్టానం ఇప్పటికే కార్యాచరణ ఖరారు చేయగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ దూకుడు పెంచారు. రెండు దఫాలుగా రాష్ట్ర, జిల్లా పార్టీ నాయకులు, పదాధికారులు, ముఖ్య నాయకులు భేటీ అయ్యారు. ముందస్తు ఎన్నికల్లో ఏ పార్టీతోనూ కలవకుండా ఒంటరిపోరుకు నిర్ణయం తీసుకోవడంతో ఆశావహులు టిక్కెట్ల కోసం ఎవరికి వారుగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 13 స్థానాల నుంచి పోటీ.. ఆశావహుల జాబితా సేకరణ.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 స్థానాల నుంచి బీజేపీ అభ్యర్థులను బరిలోకి దింపనుంది. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ జిల్లా కమిటీలకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిసింది. పార్టీ సీనియర్లు, గతంలో పోటీ చేసి గెలిచిన, ఓడిన వారికి ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు ఆయా నియోజకవర్గాల్లో ప్రభావం చూపగల సామాజిక వర్గాలు, నేతల పేర్లను పరిశీలనలోకి తీసుకోనున్నారని తెలిసింది. కాగా.. నాలుగైదు మినహా ఆయా నియోజకవర్గాల నుంచి టికెట్ ఆశావహులు ఇప్పటికే ఎవరి ప్రయత్నాలు వారు చేస్తన్నారు. పెద్దపల్లి, కరీంనగర్, హుస్నాబాద్ టికెట్లు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డికి ఖాయమనే చెప్తున్నారు. హుజూరాబాద్‌లో కిసాన్‌మోర్చా జాతీయ కార్యదర్శి పొల్సాని సుగుణాకర్‌రావు, రామగుండంలో బల్మూరి వనిత, వేములవాడలో ప్రతాప రామకృష్ణ, ధర్మపురిలో కన్నం అంజయ్యకు అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. కాగా చొప్పదండి నుంచి కొరివి వేణుగోపాల్, లింగంపల్లి శంకర్, మానకొండూరు నుంచి మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య, కనుమల్ల గణపతి, గడ్డం నాగరాజు పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. సిరిసిల్లలో ఆకుల విజయ, ఆడెపు రవి, జగిత్యాల నుంచి ముదుగంటి రవీందర్‌రెడ్డి, మోరపల్లి సత్యనారాయణ, కోరుట్ల నుంచి పూదరి అరుణ, బాజోజు భాస్కర్ పేర్లు వినిపిస్తున్నాయి. మంథనిలో ఇద్దరి పేర్లు పరిశీలనలో ఉన్నా.. టీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ ఓ నేతకు చాన్స్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. వేచిచూసే ధోరణిలో పార్టీ అధిష్టానం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ అసంతృప్తులకూ గాలం.. ఉమ్మడి జిల్లాలో పలు నియోజకవర్గాల్లో బీజేపీకి మొదటి నుంచి మంచి పట్టు ఉంది. గత ఎన్నికల సందర్భంగా వచ్చిన ఓట్లు, అంతర్గతంగా పార్టీ చేయించిన సర్వేల ఆధారంగా కొన్ని నియోజకవర్గాలపై బలమైన ఫోకస్ పెట్టింది. పార్టీకి సానుభూతి ఉన్న నియోజకవర్గాల్లో అసంతృప్తితో ఉన్న ఇతర పార్టీల్లోని నాయకులను సైతం చేర్చుకోవా లని ప్రణాళిక రూపొందించింది. అందుకు అనుగుణంగా ఇప్పటికే కొంత మంది నేతల జాబితా ను సిద్ధం చేసుకున్న పార్టీ అధినాయకత్వం సదరు నేతలతో సంప్రదింపులు చేపట్టినట్లు తెలుస్తోంది. మంథని, వేములవాడ, చొప్పదండి, జగిత్యాలల్లో టీఆర్ఎస్ అభ్యర్థులపై రగడ సాగుతోంది. అలాగే హుజూరాబాద్, చొప్పదండి, కోరుట్ల, వేములవాడ తదితర నియోజకవర్గాల్లో కాంగ్రెస్ టికెట్ కోసం పోటీపడే అభ్యర్థుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఈ రెండు పార్టీలకు చెందిన కొందరు నాయకులు ఇప్పటికే బీజేపీ అధిష్టానంతో టచ్‌లో ఉన్నట్లు కూడా చెప్తున్నారు. ఇదే జరిగితే వారిని సైతం పార్టీలో కలుపుకుని టిక్కెట్ ఇవ్వాలనే యో చన కూడా బీజేపీ చేస్తోంది. ఇదిలా వుంటే రాను న్న ముందస్తు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ అధినాయకత్వం రకరకాల వ్యూహాలను సిద్ధం చే స్తోంది. సంస్థాగతంగా బలంగా ఉన్న బీజేపీ అన్ని రకాల అస్త్రాలను ప్రయోగించేందుకు ప్రణాళిక రచించింది. ఇటీవలి కాలంలో కర్నాటక, త్రిపుర, అస్సాం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మాదిరిగా ఇక్కడ కార్యాచరణ చేపట్టింది. అక్కడ అనుసరించిన ఫార్ములాకు శ్రీకారం చుట్టింది. పార్టీకి అనుబంధమైన సంఘాలను ఇది వరకే అప్రమత్తం చేసింది. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్తోపాటు విద్యార్థి విభాగం ఏబీవీపీ, ఇతర కార్మిక సంఘాలను ఉపయోగించుకోవాలని యోచిస్తున్నట్లు చెప్తున్నారు. -
బీజేపీలో చేరేందుకు క్యూలో ఉన్నారు
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ లో చేరేందుకు రాష్ట్రంలో పలువురు నేతలు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు.నిజాం సైన్యానికి వ్యతిరేకంగా ఆనాడు పోరాడిన బైరాన్‌పల్లి, పరకాల వంటి పోరాట కేంద్రాలను తాము అధికారంలోకి వస్తే విజ్ఞాన కేంద్రాలుగా రూపొందిస్తామని .అలాగే అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, గుజరాత్లో నిర్మించబోయే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ తరహాలో తెలంగాణలో స్టాచ్యూ ఆఫ్ లిబరేషన్‌ను నిర్మిస్తామని చెప్పారు.గురువారం ముషీరాబాద్‌లో లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడారు. 2019 ఎన్నికల్లో బీజేపీ ఒంటరి పోరాటమే చేసి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.అయితే ఇటీవల కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వచ్చినప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరును పొగుడుతున్నారని, మీరేమో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని విలేకరులు ప్రశ్నించగా ప్రభుత్వాలు వేరు, పార్టీలు వేరని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అందులోని మంత్రులు ఒకరికొకరు సహకరించుకోవచ్చని, అయితే ఆయా పార్టీల అధ్యక్షులు చెప్పిందే పార్టీ లైన్ అని స్పష్టం చేశారు. ఇటీవల బీజేపీలోకి అనేక మంది వలస వస్తున్నారని, జెడ్పీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హేమాజీ, మాజీ ఎమ్మెల్యేలు నందీశ్వర్ గౌడ్, సత్యవతి, డీఎస్ తనయుడు అరవింద్‌లు పార్టీలో చేరారన్నారు. ఇంకా చాలా మంది ప్రముఖులు అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు. -
తరలిస్తే సహించం
బీజేపీ ఎమ్మెల్యేల హెచ్చరిక హైదరాబాద్: ఇందిరాపార్కు వద్దనున్న «ధర్నాచౌక్‌ను నగర శివార్లకు తరలిస్తే సహిం చమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కె.లక్ష్మణ్ మండిపడ్డారు. ఇందిరాపార్కు వద్ద ధర్నాల నిషేధానికి నిరసనగా గురు వారం బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పాద యాత్ర నిర్వహించారు. బీజేపీ శాసన సభాపక్షనేత జి.కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ రామచందర్ రావు ఇందిరాపార్కు నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర చేశారు. అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమానికి బీజం వేసిన ఇందిరాపార్కు ధర్నాచౌక్‌ను తరలిస్తామంటే ఊరుకోబోమని, ఉద్యమా నికి ఊపిరిగా నిలిచిన పార్టీలను, ప్రజా సంస్థలను ఏకం చేసి పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పద్ధతిలో పోరా టాలు చేస్తామన్నారు. ఎమ్మెల్యేలతో కలసి ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద ధర్నాలు చేస్తా మని చెబుతున్న కేసిఆర్.. ఇందిరాపార్కు వద్ద ధర్నాచౌక్‌ను ఎత్తివేయడం విడ్డూరంగా ఉందన్నారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. పత్రికా స్వేచ్చను, ప్రజాస్వామ్యాన్ని హరించిన ఫలితంగా 1977 ఎన్నికలల్లో ఇందిరాగాంధీకి ప్రజలు ఎలాంటి గుణ పాఠం చేప్పారో గుర్తుచేశారు. ధర్నాచౌక్‌పై నిషేధాన్ని వెంటనే ఉపసంహ రించుకో వాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజాగ్రహనికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. -
ధర్నాచౌక్‌ను కొనసాగించాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజల సమస్యలపై నిరసన వ్యక్తంచేయడానికి కూడా అవకాశం లేకుండా ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అఖిలపక్ష నేతలు, వివిధ ప్రజాసంఘాల నాయకులు గురువారం గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో జంతర్‌మంతర్ దగ్గర ధర్నా చేస్తామని సాక్షాత్తూ శాసనమండలిలోనే చెప్పిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, రాష్ట్రంలో మాత్రం ఇందిరాపార్కు దగ్గర ధర్నాచౌక్ లేకుండా చేయాలని నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని వారు గవర్నర్‌కు విన్నవించారు. ఈ బృందంలో ఉత్తమ్ కుమార్‌రెడ్డి (టీపీసీసీ అధ్యక్షుడు), కె.లక్ష్మణ్ (బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు), ఎల్.రమణ (టీటీడీపీ అధ్యక్షుడు), చాడ వెంకటరెడ్డి (సీపీఐ రాష్ట్ర కార్యదర్శి), నాగయ్య(సీపీఎం), కె.శివకుమార్ (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ), ఆర్.కృష్ణయ్య(ఎమ్మెల్యే), మంద కృష్ణమాదిగ (ఎంఆర్పీఎస్), గోపాలశర్మ,, ఇటిక్యాల పురుషోత్తం (తెలంగాణ జేఏసీ), వెంకటేశ్వర్రావు (న్యూ డెమొక్రసీ), టి.కుమార్ (ఎంసీపీఐ– యూ), జానకి రాములు (ఆర్ఎస్పీ), బండా సురేందర్‌రెడ్డి (ఫార్వర్డ్‌బ్లాక్) తదితరులు ఉన్నారు. ప్రజా సమస్యలపై నిరసన తెలియజేయడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దానిని కాపాడాల్సిన బాధ్యత రాజ్యాంగ పరిరక్షకునిగా గవర్నరుపై ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంకోసం ఇందిరాపార్కు దగ్గర వందలకొద్ది సభలు, సమావేశాలు, నిరసన దీక్షలు జరిగాయని అఖిలపక్షం నేతలు గవర్నర్‌కు వివరించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతున్నదనే కుంటి సాకుతో ధర్నాచౌక్‌ను ఇందిరా పార్కువద్ద లేకుండా చేయాలని ప్రభుత్వం ప్రయ త్నిస్తున్నదన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న బేగంపేటలోని క్యాంపు కార్యాల యానికి వేలమందిని తరలించారని, దానికి ట్రాఫిక్ అంతరాయం కలుగలేదా ప్రభుత్వాన్ని ప్రశ్నించాచు. రాష్ట్రంలో 25 ఏళ్లుగా జరిగిన నిరసనలకు సంబంధించిన ఫోటోలను, క్లిప్పింగులను మంద కృష్ణ మాదిగ గవర్నర్‌కు చూపించారు. ధర్నాచౌక్‌ను తరలించవద్దని, శాంతియు తంగా జరిగే నిరసనలకు అవకాశం కల్పించాలని కోరారు.