
సాక్షి, హైదరాబాద్ : అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తనపై బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇందిరా పార్క్ తరలింపును అడ్డుకుంటునందుకు కేసీఆర్‌ను తనను బెదిరించారన్నారు. ఇందిరాపార్క్‌లో మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో వాకర్స్ భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటల అదుపునకు యత్నిస్తున్నారు.
పార్క్‌కి అందరు వచ్చే సమయంలో మంటలు వ్యాపించడంతో వాకర్స్ ఆందోళనకు దిగారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ..అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇందిరా పార్క్‌లో తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. చెత్త చెదారంతో ఇందిరా పార్క్ డంపింగ్ యార్డ్‌లా తయారైందని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment