‘చలో హైదరాబాద్’ను విజయవంతం చేయండి : ఏపీఎన్జీవో | Success the Chalo Hyderabad strike : AP NGO | Sakshi
Sakshi News home page

‘చలో హైదరాబాద్’ను విజయవంతం చేయండి : ఏపీఎన్జీవో

Published Mon, Jan 20 2014 1:36 AM | Last Updated on Sat, Mar 23 2019 9:03 PM

Success the Chalo Hyderabad strike : AP NGO

సాక్షి, హైదరాబాద్: ఈ నెల 22వ తేదీన హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ‘చలో హైదరాబాద్’ పేరిట చేపట్టనున్న ధర్నాను విజయవంతం చేయాలని ఏపీఎన్జీవోల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణకు సీమాంధ్ర ప్రాంత శాసన సభ్యులపై  ఒత్తిడి పెంచేందుకు చేపడుతున్న ఈ ధర్నాను విజయవంతం చేయాలని పలు సంఘాలకు పిలుపునిచ్చారు. ఈ ధర్నాకు సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా మద్దతివ్వాలని ఆదివారం ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కోరారు.

 

ఈ సందర్భంగా ‘చలో హైదరాబాద్’ ధర్నా పోస్టర్‌ను ఆవిష్కరించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనివార్యమని, అవసరమైతే రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా చేయాలన్న లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. సమైక్యవాదుల ఓట్లతో గెలిచిన జేపీ ఆ విషయాన్ని మరచి మాట్లాడడం బాధాకరమన్నారు. వచ్చే ఎన్నికల్లో జేపీపై పోటీకి ఉద్యోగుల్లో ఒకరిని దించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement