జెడ్పీసెంటర్, న్యూస్‌లైన్: సీమాంధ్రుల కబంధహస్తాల్లో బం దీ అయిన తెలంగాణ తల్లికి విముక్తి క ల్పించేవరకు పోరాటం కొనసాగుతుంద ని టీజేఏసీ రాష్ట్ర కోచైర్మన్, టీజీఓ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్‌గౌడ్ స్పష్టంచేశారు. తెలంగాణ ను అడ్డుకునే శక్తుల జాబితాను తయారుచేస్తున్నామని, ప్రత్యేక రాష్ట్రం వ చ్చిన తరువాత వారి భరతం పడతామని హెచ్చరించారు. ఆదివారం ఆయన స్థాని క టీఎన్‌జీఓ భవన్‌లో విలేకరులతో మా ట్లాడారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ సీమాంధ్ర ఉద్యమాన్ని నడపడం రాజ్యాంగాన్ని అవమానించడమే అవుతుందన్నారు.
బిల్లులో తెలంగాణకు న ష్టంచేసే అంశాలు చాలాఉన్నాయని, వాటిని సవరించాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం టీజేఏసీ ఆధ్వర్యంలో జా తీయస్థాయిలో అన్ని పార్టీలను కలిసి విన్నవిస్తామన్నారు. తెలంగాణపై అసెం బ్లీలో చర్చ మొదలైందని, అల్లరిచేస్తూ చర్చ జరగకుండా సీమాంధ్ర నాయకులు అడ్డుకోవడం సరికాదన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి లేని ఆంక్షలు తెలంగాణకే ఎందుకని శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. సీమాంధ్ర సీఎం డ్రామాలు ఈనెల 23 వరకేనని, ఎట్టి పరిస్థితిలోనూ బిల్లు రాష్ట్రపతికి పంపాల్సిందేనన్నారు. ఆంక్షలు లేని తెలంగాణ ఇవ్వాలనే డిమాండ్‌తో ఈనెల 7న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద సంపూర్ణ తెలంగాణ సాధన సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణవాదులు, ప్రజలు అధికసంఖ్యలో హా జరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సభలో తెలంగాణ వ్యతిరేకులపై కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. జిల్లా చైర్మన్ రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ అభిప్రాయంతో సంబంధం లేకుండానే రాష్ట్రాలను విభజించే అధికారం కేంద్రానికి ఉందన్నారు. అనంతరం తెలంగాణ సాధనసభ పోస్టర్‌ను విడుద ల చేశారు. కార్యక్రమంలో టీజేఏసీ నా యకులు బాల్‌కిషన్, జీవన్, చంద్రనాయక్, వెంకటయ్య, రామకృష్ణారావు, సా యిబాబా, మున్నూరు రవి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగుల సంక్షేమానికి పాటుపడాలి
యూనియన్లు ఉద్యోగుల సంక్షేమ కోసం పాటుపడాలని టీజీఓ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్‌గౌడ్ కోరారు. టీఎన్‌జీఓ మక్తల్ తాలుకా కమిటీ క్యాలెండర్‌ను ఆదివారం ఆయన స్థానిక టీఎన్‌జీఓ భవన్‌లో ఆవి ష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులది కీలకపాత్ర అన్నారు. ఉద్యోగులను వేధిస్తే చూ స్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగులపై పెట్టిన కేసులను వెత్తివేస్తామన్నారు. కార్యక్రమంలో టీఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు రా జేందర్‌రెడ్డి, జీవన్, బాల్‌కిషన్, రామకృష్ణరావు, చంద్రనాయక్ తదితరులు పాల్గొన్నారు.