నల్లచొక్కాలతో జూడాల నిరసన | junior doctors protest with black shirts | Sakshi
Sakshi News home page

నల్లచొక్కాలతో జూడాల నిరసన

Published Sat, Nov 1 2014 12:54 AM | Last Updated on Sat, Sep 2 2017 3:39 PM

సమస్యలను పరిష్కరించాలని జూనియర్ డాక్టర్లు శుక్రవారం ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో నల్లచొక్కాలు ధరించి వినూత్న రీతిలో నిరసన తెలిపారు.

హైదరాబాద్: సమస్యలను పరిష్కరించాలని   జూనియర్ డాక్టర్లు శుక్రవారం ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో నల్లచొక్కాలు ధరించి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ క్రాంతి, కన్వీనర్ డాక్టర్ శ్రీనివాస్, నేతలు డాక్టర్ నాగార్జున మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ జూనియర్ డాక్టర్ల రూరల్ సర్వీస్‌ను రెండేళ్లకు పెంచాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

డిమాండ్లను పరిష్కరించాలి: చాడ
జూడాల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి శుక్రవారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement