నేడు గవర్నర్‌ను కలవనున్న వైఎస్‌ జగన్‌ | YS Jagan Meets Governor Narasimhan On 16th April | Sakshi
Sakshi News home page

నేడు గవర్నర్‌ను కలవనున్న వైఎస్‌ జగన్‌

Published Tue, Apr 16 2019 2:24 AM | Last Updated on Tue, Apr 16 2019 8:58 AM

YS Jagan Meets Governor Narasimhan On 16th April - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతల పరిస్థితిపై ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌కు ఫిర్యాదు చేయనున్నారు. ఆయన సారథ్యంలోని పార్టీ ప్రతినిధి వర్గం మంగళవారం ఉదయం 11 గంటలకు గవర్నర్‌ను హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో కలవనుంది.

పోలింగ్‌ ముగిశాక తమ పార్టీ వారిపై, తమకు ఓట్లేసిన సాధారణ ప్రజలపై టీడీపీ వర్గీయులు దాడులకు తెగబడుతుండటాన్ని జగన్‌ గవర్నర్‌కు వివరించనున్నారు. రాష్ట్రంలో టీడీపీ పాలనా తీరుపై కూడా గవర్నర్‌ దృష్టికి తెస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. (చదవండి: అది పక్షపాత హింస)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement