అహోబిలం అభివృద్ధికి సహకారం  | Governor ESL Narasimhan Visit Ahobilam Temple | Sakshi
Sakshi News home page

అహోబిలం అభివృద్ధికి సహకారం 

Published Thu, Feb 28 2019 7:28 AM | Last Updated on Thu, Feb 28 2019 7:28 AM

Governor ESL Narasimhan  Visit Ahobilam Temple - Sakshi

గవర్నర్‌ దంపతులకు జ్ఞాపిక అందజేస్తున్న దృశ్యం

ఆళ్లగడ్డ: నవనారసింహులు కొలువైన అహోబిల క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తన వంతు సహకారం అందిస్తానని తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. నవనారసింహులును దర్శించుకోవడానికి మంగళవారం రాత్రి దిగువ అహోబిలం చేరుకుని స్థానిక మలోల అతిథి గృహంలో బస చేసిన గవర్నర్‌ దంపతులు.. బుధవారం వేకువజామునే దిగువ అహోబిలంలో కొలువైన శ్రీప్రహ్లాద వరదస్వామి దివ్యదర్శన పూజలో పాల్గొన్నారు.

అనంతరం ఎగువ అహోబిలం చేరుకుని.. శ్రీ జ్వాలా నారసింహస్వామి, చెంచులక్ష్మి అమ్మవార్లకు పూజలు చేశారు. తర్వాత కాలినడకన వెళ్లి  నల్లమలలో వెలసిన జ్వాలా క్షేత్రాన్ని సందర్శించారు. తిరిగి దిగువ అహోబిలం చేరుకున్న గవర్నర్‌ దంపతులకు ఆలయ మర్యాదల్లో భాగంగా తీర్థప్రసాదాలు, జ్ఞాపికను అందజేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement