
సాక్షి, హైదరాబాద్ : అనారోగ్యంతో మరణించిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుభాషణ్ రెడ్డి భౌతికకాయానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు. బషీర్‌బాగ్‌లోని అవంతినగర్‌లో జస్టిస్ సుభాషణ్ రెడ్డి నివాసంలోకి బుధవారం వెళ్లారు. ఈ సందర్భంగా నివాళులు అర్పించి, కుటుంబసభ్యులను పరామర్శించారు.
చదవండి....(జస్టిస్ సుభాషణ్ రెడ్డి కన్నుమూత)
మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహన్ దంపతులు, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, పలువురు నేతలు జస్టిస్ సుభాషణ్ రెడ్డి పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన నెల రోజులుగా ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఇవాళ సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో జస్టిస్ సుభాషణ్‌రెడ్డి అంత్యక్రియలు జరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment