ఏపీ సీఎం జగన్‌ నిర్ణయం అభినందనీయం | Asaduddin Owaisi lauds Andhra CM Jagan Decision To Oppose NRC | Sakshi
Sakshi News home page

ఏపీ సీఎం జగన్‌ నిర్ణయం అభినందనీయం

Published Wed, Dec 25 2019 1:56 AM | Last Updated on Wed, Dec 25 2019 1:56 AM

Asaduddin Owaisi lauds Andhra CM Jagan Decision To Oppose NRC - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ పౌర రిజిస్టర్‌ (ఎన్‌ఆర్సీ)పై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం అభినందనీయమని ఏఐఎం ఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. మంగళవారం హైదరాబాద్‌ దారుస్సలాంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘వైఎస్‌ జగన్‌ నాకు మంచి మిత్రుడు. ఆయ న ఎప్పుడూ మిత్రుడుగానే ఉంటారు. ఆయన ఒక రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. చాలా ఇబ్బందులు ఉంటాయి. ఒక నిర్ణయం తీసుకోవడం అంత సులువు కాదు. ఆ రాష్ట్రాన్ని గత టీడీపీ ప్రభుత్వం భ్రష్టు పట్టించింది. అయినా ఆయన పార్టీ, ప్రభు త్వం ఎన్‌ఆర్సీకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంది. జగన్‌మోహన్‌రెడ్డిది మంచి నిర్ణయం. ఇందుకు ఆయనకు కృతజ్ఞతలు’ అన్నారు. అలాగే, ఎన్‌ఆర్సీ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ గట్టి నిర్ణయం తీసుకున్నారని అసద్‌ అభినందించారు. బీజేపీ ప్రజాప్రతినిధి తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై స్పంది స్తూ.. ఆయన ఆలోచనా తీరు చిన్నదని, పంక్చర్‌ వేసే వ్యక్తులైతే తప్పేముందని ప్రశ్నించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement