
సాక్షి, హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణరావు, కేవీ రావు గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. పుల్వామా ఉగ్రదాడిపై చంద్రబాబు నిరాధార ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలిపారు. రాజకీయాల్లో సీనియర్‌నని చెప్పుకునే బాబు ఇలా మాట్లాడడం మంచిది కాదని హితవు పలికారు. బాబు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గవర్నర్ తమ ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించారని తెలిపారు. (మోదీ అంతటి సమర్థుడే.. అప్పుడు తెలియదా బాబు!?)
పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది జవాన్లను కోల్పోయి యావత్ దేశం విషాదంలో మునిగితే.. చంద్రబాబు మాత్రం మోదీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. ఉగ్రదాడిపై మమతా బెనర్జీ వ్యాఖ్యలను ఉటంకిస్తూ... పుల్వామా దాడికి ప్రధాని మోదీయే కారణమనే అర్థం వచ్చేలా బాబు విమర్శల దాడికి దిగారు. మంగళవారం టీడీపీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ లబ్ది కోసం దేశాన్ని తాకట్టు పెడితే సహించేది లేదంటూ చంద్రబాబు హెచ్చరించారు. దేశభక్తి, భద్రతలో టీడీపీ రాజీపడదు అని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment