
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. శనివారం ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం గవర్నర్ విజయవాడకు చేరుకున్నారు. విజయవాడలోని గేట్ వే హోటల్‌లో బస చేసిన గవర్నర్‌ను ముఖ్యమంత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రేపు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న 25మంది జాబితాను ముఖ్యమంత్రి గవర్నర్‌కు అందజేశారు. ముఖ్యమంత్రి అందజేసిన మంత్రివర్గ జాబితాను గరర్నర్ రాజ్యాంగబద్ధంగా పరిశీలించిన అనంతరం సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ)కి పంపిస్తారు. తర్వాత జీఏడీ అధికారులు మంత్రులుగా నియమితులైనవారికి అధికారికంగా సమాచారం అందజేస్తారు.
చదవండి :
ఏపీ సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయం
సచివాలయంలో సిద్ధమౌతున్న సీఎం చాంబర్
Comments
Please login to add a commentAdd a comment