22 లేదా 23న ఏపీ గవర్నర్‌ బాధ్యతలు | AP Bhawan Resident Commissioner Met Biswabhusan Harichandan | Sakshi
Sakshi News home page

22 లేదా 23న ఏపీ గవర్నర్‌ బాధ్యతల స్వీకరణ

Published Wed, Jul 17 2019 8:08 PM | Last Updated on Wed, Jul 17 2019 8:22 PM

AP Bhawan Resident Commissioner Met Biswabhusan Harichandan - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ నూతన గవర్నర్‌గా నియమితులైన విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఈ నెల 22న లేదా 23వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నట్టు సమాచారం. ఆయనను ఏపీ గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి మంగళవారం ఉత్తర్వులు జారీ చేయడంతో ఢిల్లీలోని ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తరఫున బుధవారం భువనేశ్వర్‌ వెళ్లి ఆయనతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ఉత్తర్వులను ఆయనకు అందజేశారు. అలాగే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తరఫున విశ్వభూషణ్‌కు పుష్పగుచ్చాన్ని, శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు. కాగా విశ్వభూషణ్‌ హరిచందన్‌కు తెలుగు రాష్ట్రల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి హరిచందన్‌ కృషి చేస్తారని ఆయన ఆకాంక్షించారు.

చదవండికొత్త గవర్నర్‌కు సీఎం జగన్‌ ఫోన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement