
సాక్షి, విజయవాడ : బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో వివిధ అంశాలపై చర్చించే క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. ఈ క్రమంలో సీఎం జగన్ నగరంలోని గేట్‌వే హోటల్‌కు చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 11 నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి జూలై 12న ఉదయం 11 గంటలకు సభలో తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
ఈ నేపథ్యంలో ప్రవేశపెట్టబోయే రాష్ట్ర బడ్జెట్, ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ తదితర అంశాలపై సీఎం జగన్ గవర్నర్‌తో చర్చించనున్నారు. ఇక మంగళవారం ముందుగానే గేట్‌వే హోటల్‌కు చేరుకున్న గవర్నర్ నరసింహన్‌కు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఆర్పీ సిసోడియా, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ సాదర స్వాగతం పలికారు.