
గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న తెలుగు వర్సిటీ మాజీ వీసీ మంజులత
సాక్షి, హైదరాబాద్: సీఆర్ రావు జీవితం స్ఫూర్తిదాయకం అని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు. తెలుగు వర్సిటీ మాజీ వైస్ చాన్స్‌లర్ ఆవుల మంజులత తెలుగులోకి అనువదించిన ‘‘డాక్టర్ సీఆర్ రావు జీవితం–కృషి ’’ అనే పుస్తకాన్ని గవర్నర్ బుధవారం రాజ్‌భవన్‌లో ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ సీఆర్ రావు లోకరత్న అని, స్టాటిస్టిక్స్‌లో అద్భుతాలు చేయడం ఆయనకే సాధ్యమన్నారు.
కోల్‌కతాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్టాటిస్టిక్స్‌ను సందర్శించినప్పుడు స్టాటిస్టిక్స్ అంటే సంఖ్యలు మాత్రమే కాదని అందులో సైన్స్ కూడా ఉంటుందన్నారని నరసింహన్ గుర్తు చేశారు. పరిశోధనల నిమిత్తం సీఆర్ రావు అడ్వాన్స్‌డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాథమేటిక్స్ స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్(ఏఐఎంఎస్‌సీఎస్)కు గవర్నర్ ప్రత్యేక నిధి కింద రూ. లక్ష మంజూరు చేశారు.