
సాక్షి, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకుగాను గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మేడిగడ్డకు చేరుకున్నారు. యోగా డే సందర్భంగా రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ అనంతరం బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో కలిసి ప్రత్యేక విమానంలో మేడిగడ్డకు బయలుదేరారు. అక్కడ సీఎం కేసీఆర్ వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం జలసంకల్ప యాగంలో పాల్గొన్నారు. కాగా ఇంతకు ముందే ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మేడిగడ్డకు చేరుకున్నసంగతి తెలిసిందే. ముగ్గురు సీఎంలు గవర్నర్‌తో కలిసి యాగంలో పాల్గొన్నారు. మేడిగడ్డ వద్ద శృంగేరి పీఠం అర్చకుల ఆధ్వర్యంలో జలసంకల్ప యాగం కొనసాగుతోంది. ఈ యాగంలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన సతీమణి శోభ పాల్గొన్నారు. అక్కడ జలసంకల్ప యాగం, పూజలు కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment