
వెల్లివిరిసిన మతసామరస్యం
జిల్లా వ్యాప్తంగా సోమవారం మతసామరస్యం వెల్లివిరిసింది. రంజాన్‌ను పురస్కరించుకుని కులమతాలకు అతీతంగా అందరిలోనూ ఆనందోత్సాహాలు వ్యక్తమయ్యాయి. నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలతో నియమాన్ని ఆచరించిన ముస్లింలు.. ఆదివారం రాత్రి నెలవంక దర్శనంతో పులకించిపోయారు. సోమవారం ఉదయమే కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ.. ప్రత్యేక ప్రార్థనల కోసం ఈద్గా మైదానాలకు చేరుకున్నారు. జిల్లా కేంద్రం అనంతపురంతో పాటు కదిరి, హిందూపురం, తాడిపత్రి, ధర్మవరం, గుంతకల్లు, ధర్మవరం తదితర ప్రాంతాల్లో భారీ సంఖ్యలో ముస్లింలు సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ తెలుపుకున్నారు.
- సాక్షి నెట్‌వర్క్, అనంతపురం