నేటి నుంచే రంజాన్ ఉపవాస దీక్షలు
ఆకాశంలో నెలవంక దర్శనం
న్యూఢిల్లీ/హైదరాబాద్: ముస్లిం సోదరులకు పవిత్రమైన రంజాన్ మాసం మంగళవారం నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. సోమవారం రాత్రి ఆకాశంలో నెలవంక కనిపించడంతో రుయత్ హిలాల్ కమిటీ సదర్ మజ్లీస్ ఉలేమా ఈ దక్కన్‌తో పాటు పలు హిలాల్ కమిటీలు ఈ మేరకు ప్రకటించాయి. రంజాన్ మాసపు మొదటి ఉపవాస దీక్ష మంగళవారం తెల్లవారుజామున సహార్‌తో మొదలైంది.
హైదరాబాద్‌లో చారిత్రక మక్కా మసీదులో ముస్లిం సోదరులు సోమవారం రాత్రి ఇషా నమాజ్, అనంతరం రాత్రి తరావీ సందర్భంగా ఖురాన్ పఠనం చేశారు. మంగళవారం తెల్లవారుజామున 4.09 గంటల సహార్‌తో రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం6.55 గంటలకు ఉపవాస దీక్ష విరమించి ఇఫ్తార్ విందులో పాల్గొంటారు.