రంజాన్ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని పేద ముస్లింలకు నాలుగు రకాల సరుకులను ఉచితంగా పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ జి.జయలక్ష్మి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
సాక్షి, హైదరాబాద్ః రంజాన్ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని పేద ముస్లింలకు నాలుగు రకాల సరుకులను ఉచితంగా పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ జి.జయలక్ష్మి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తెల్లరేషన్ కార్డున్న ప్రతి కుటుంబానికి 2 కిలోల చక్కెర, 5 కిలోలు గోధుమ పిండి, ఒక కిలో సేమియా, 100 గ్రాముల నెయ్యి పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 లక్షల మంది పేద ముస్లిం కుటుంబాలు లబ్ది పొందనున్నట్లు ఉత్తర్వుల్లో ఆమె పేర్కొన్నారు.