
వోడాఫోన్ రంజాన్ స్పెషల్ ఆఫర్లు
ముంబై: వోడాఫోన్ ఇండియా తన ఖాతాదారులకోసం పవిత్ర రంజాన్ సందర్భంగా స్పెషల్ ఆఫర్లను ప్రకటించింది. మంగళవారం అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ ఆఫర్ లో అన్ లిమిటెడ్ కాలింగ్, ఉచిత ప్రత్యేక డేటా ప్లాన్లను ప్రకటించింది.
రంజాన్ స్పెషల్ ప్యాక్ లో ఒకరోజు వ్యాలిడిటీతో , 2జీ వినియోగదారులు 444 * 5 # డయలింగ్ ద్వారా రూ.5 తో అపరిమిత డేటా ఆఫర్ను పొందవచ్చు. అలాగే 3జీ కస్టమర్లు * 444 * 19 # డయలింగ్ ద్వారా రూ.19 లపై అపరిమిత డేటా ఆఫర్ను పొందవచ్చు. అయితే యుపి (వెస్ట్) ఉత్తరాఖండ్ ప్రాంతంలోని నివాసితులకు మాత్రమే ఈ ఆఫర్లు లభ్యం.