
జగన్ రంజాన్ శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింలందరికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మహనీయుడైన మహ్మద్ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించింది కూడా రంజాన్ మాసంలోనే కావడంతో ముస్లింలు ఈ నెలకు అత్యంత ప్రాముఖ్యతను ఇస్తారని తెలిపారు.
ఐకమత్యంతో మెలగడం, క్రమశిక్షణ కలిగి ఉండటం, పేదలకు తోడ్పాటు అందించడం, రంజాన్ మానవాళికి ఇచ్చే సందేశమని ఆయన సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సొంత లాభం కొంత మానుకుని పొరుగువారికి సాయపడాలన్న ఆశయం రంజాన్ పండుగలో అంతర్లీనంగా ఉన్న సందేశమని జగన్ పేర్కొన్నారు.