
సామరస్యానికి ప్రతీక రంజాన్: వైఎస్ జగన్
హైదరాబాద్: రంజాన్ పండుగను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈద్ ముబారక్ తెలిపారు. రంజాన్ పండుగ సామరస్యానికి, సుహృద్భా వానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని, ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు. మనిషిలోని చెడు భావనలను, అధర్మం, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ అని జగన్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Pleased to have received these Ramzan wishes from the little ones. Thank you. Wishing each and everyone a very happy Ramzan. Eid Mubarak. pic.twitter.com/ofZAeux6RS
— YS Jagan Mohan Reddy (@ysjagan) 26 June 2017