
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్
న్యూఢిల్లీ : ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్) పండు గను సోమవారం జరుపుకోవాలని ఢిల్లీ జుమా మసీ దు షాహీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ ప్రకటించారు. బిహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఆదివారం నెలవంక కనిపించిందని తెలిపారు. రంజాన్ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రజలకు శుభా కాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ మాట్లాడుతూ..రంజాన్ పండుగ ప్రజల్లో సోదరభావాన్ని పెంపొందిస్తుందని తెలిపారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్ ఉల్ ఫితర్ పండుగ క్షమాగుణం, త్యా గం, దానంచేయడం లాంటి సుగుణాలను బోధిస్తుందని పేర్కొన్నారు. దేశంలో శాంతి, ప్రజల మధ్య ఐక్యత కోసం ప్రార్థనలు చేయాలని ఆమె కోరారు.